హమ్మ…కేశినేని నాని ఇందుకా బీజేపీని తిడుతోంది?

కేశినేని నాని

తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు బీజేపీపై ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధినేత చంద్రబాబు పదే పదే విమర్శించ వద్దని చెప్పినా నాని మాత్రం బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఇందుకు కారణాలు ఉన్నాయంటున్నారు. కేశినేని నానికి గతంలో పోటీ చేసేటప్పుడే చంద్రబాబు ఒక్కసారికే విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే అందుకు అయిష్టంగానే అప్పుడు ఒప్పుకున్న నాని మరోసారి తనకు అవకాశం కావాలని కోరుకుంటున్నారు. మరోవైపు విజయవాడ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కోరే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. ఈసారి విజయవాడ నుంచి పురంధ్రీశ్వరి పోటీ చేస్తారా? లేక వేరెవరినైనా బరిలోకి దింపుతారా? అన్నది తర్వాత విషయం కాని విజయవాడ పార్లమెంటు స్థానంపై బీజేపీ కన్నేసినట్లు కేశినానికి ఉప్పందంది. బీజేపీలోని తన సన్నిహితులు చెప్పడమే కాకుండా ఢిల్లీ స్థాయిలో కూడా పక్కా సమాచారం అందడంతోనే కేశినేని నాని బీజేపీపై వరుసగా మాటల దాడికి దిగుతున్నారు.

బెజవాడ సీటుపై బీజేపీ కన్ను….

బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే తన మెజార్టీ తగ్గిందని ఇటీవల వ్యాఖ్యానించిన నాని వచ్చే ఎన్నికల్లో తనకు మూడు లక్షలకు పైగా మెజారిటీ వస్తుందని చెప్పడం వెనుక అసలు కారణం ఇదేనంటున్నారు. అంతేకాకుండా తన మద్దతుదారులు, కార్యకర్తల్లోనూ పదే పదే ఇదే విషయాన్ని చెబుతుంటే వచ్చే ఎన్నికల్లోనూ తనకే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తారని భావిస్తున్నారు. బీజేపీ తో మైత్రి చెడితే తనకే ఆ టిక్కెట్ వస్తుందని నాని విశ్వసిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు స్థానం దక్కకుంటే నానికి మరెక్కడా పోటీ చేసే అవకాశమే లేదు. కృష్ణా జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులు ఒకరికి పది మంది పోటీ పడుతున్నారు. ఇక పార్లమెంటు స్థానానికి వచ్చినా అదే పరిస్థితి. తాను రాజకీయాల్లో కొనసాగాలంటే విజయవాడ పార్లమెంటు స్థానం ఒక్కటేనని నానికి తెలియంది కాదు. అందుకోసమే బీజేపీపై విమర్శలు చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. బీజేపీ ఇప్పటికే విజయవాడ పార్లమెంటు స్థానంపై కన్నేసింది. టీడీపీతో పొత్తు ఖరారయితే ఈసారి ఎక్కువ లోక్ సభ స్థానాలను అడిగే అవకాశముంది. అందులో విజయవాడ కూడా ఒకటి. అందుకోసమే నాని బీజేపీపై చిందులు తొక్కుతున్నారన్నది వాస్తవం. మరోవైపు చంద్రబాబు మాత్రం బీజేపీతో పొత్తును తెంచుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో నాని భవిష్యత్ ఎలా ఉంటుందో?

Ravi Batchali
About Ravi Batchali 36022 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*