2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కాదట…

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్ధిగా కేసీఆర్ ఉండరట. ఈ మాటలన్నది ఎవరో కాదు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్. 2019 ఎన్నికల తర్వాత కె. చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లోకి వెళతారట. కేసీఆర్ సూచించిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని ఈ ఎంపీ చెబుతున్నారు. తెలంగాణలో రావుల పాలన అని కాంగ్రెస్ విమర్శించడాన్ని నర్సయ్య గౌడ్ తప్పుపట్టారు. ప్రజలు ఆదరించినందువల్లే సీఎంగా కేసీఆర్ అయ్యారన్నారు.

మొత్తం మీద నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలతో గులాబీ నేతల్లో చర్చ మొదలైంది. కేసీఆర్ సీఎం కాకుంటే ఇంక ఎవరవుతారు? కేటీఆర్ అని చాలామంది నేతలు అంటున్నారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ సీఎం బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనల్లో ఉన్నట్లు అర్థమైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*