
ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం. మోడీ కనుసన్నల్లో ఏపీ పాలన….. ఈసీ డైరెక్షన్ లో సీఈఓ యాక్షన్…….. గత వారం పది రోజులుగా సామాన్య జనానికి తెలిసిన వార్తలు.., వాస్తవాలు ఇవేనా…? అసలు ఏపీలో ఎన్నికలకు ముందు.. పోలింగ్ తర్వాత ఏం జరుగుతోంది…? తెలుగుపోస్ట్ ప్రత్యేక కథనం.
సిక్కోలు నుంచి మొదలు…
మొదట శ్రీకాకుళం కలెక్టర్ ధనుంజయ్ రెడ్డి బదిలీ….. ఆయన స్థానంలో రామారావు నియామకం…… ధనుంజయ్ రెడ్డిని అకారణంగా బదిలీ చేస్తే ఇప్పటి వరకు ఆ సంగతి వైసీపీ అధ్యక్షుడు జగన్ తో సహా ఆ పార్టీ మొత్తం ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. శ్రీకాకుళం జిల్లా భౌగోళిక స్వరూపం, సమస్యలు, ఎన్నికల సన్నద్ధతను వివరించడంలో రామారావు విఫలం అయ్యాక ఈసీ ఆయనను మార్చింది. కలెక్టర్ బదిలీ ఎందుకు జరిగింది…. కేవలం కులం కారణంతో మార్పు.
ఇంటెలిజెన్స్ డీజీ….
వైసీపీ ఫిర్యాదులు అయితేనేం., అధికార పార్టీతో ఉన్న సాన్నిహిత్యం అయితేనేమి మార్చి 26న డీజీ ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు ను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసీ ఉత్తర్వులతో జీవో 716 విడుదల అయ్యింది. మర్నాడు ఉదయాన్నే దానిని ఊపసంహరించుకుంటు జీవో 720 విడుదల చేశారు. ఆ తర్వాత ప్రజా ప్రాతినిధ్య చట్టం పరిధిలో డీజీ ఇంటెలిజెన్స్ రారంటూ జీవో 721 విడుదల చేశారు. ఫలితంగా కోర్టు అక్షింతలతో పాటు ఏకంగా సీఎస్ పదవికి ఎసరు తెచ్చారు.
సీఎస్ ని ముంచింది ఎవరు…..?
నెల రోజుల్లో పదవీ విరమణ చేసే అధికారి అవమానకర పరిస్థితుల్లో ఆ స్థానం వీడాల్సి వచ్చింది. మార్చి 27 ఉదయం హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యే సమయానికి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలీని స్థితికి సీఎస్ వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం తరపున ప్రకాష్ రెడ్డి వాదన ముందు చిత్తయ్యాక కానీ తత్వం బోధ పడలేదు. న్యాయ నిపుణుల సలహా తీసుకునే అవకాశం కూడా మాజీ సీఎస్ కి లేకపోవడానికి ఎవరి ఒత్తిడి కారణమో అధికార వర్గాల్లో బాగా తెలుసు..
ఎన్నికల సంఘాన్ని ధిక్కరించి…..
ఎన్నికల సంఘాన్ని ధిక్కరించి., దాని చిత్తశుద్ధిని ప్రశ్నించి… తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీసిన అధికారులు ఇప్పుడు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. జీవిత కాలం సర్వీస్ రికార్డ్ లలో మచ్చలుగా మిగిలే ప్రమాదం వెంటాడుతోంది. వ్యక్తిగత భావనలు… ఉద్దేశాలు ఎప్పటికైనా ప్రమాదం అని ఈ ఉదంతాలు చెబుతున్నాయి. అందుకే అధికారులూ బీకేర్ ఫుల్.
Leave a Reply