ఆ అవకాశం లేదే…. ఉంటుందా?

indian national congress in madhyapradesh, rajasthan

ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందే నేతలు చెప్పినట్లు కూటమి ఏర్పడుతుందా? పార్టీల మధ్య ఆ సఖ్యత కుదురుతుందా? ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇదే చర్చ జరుగుతోంది. మోదీని ఓడించాలంటే ఎన్నికలకు ముందే కూటమి ఏర్పడాలని అన్ని బీజేపీయేతర పార్టీలూ భావిస్తున్నాయి. ఇందులో మమత బెనర్జీ, చంద్రబాబునాయుడు, శరద్ పవర్ లాంటి వాళ్లు ఏకాభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్ తో కలసి ఎన్నికలకు ముందే కూటమిని ఏర్పరచుకోవడానికి వీరికి పెద్దగా అభ్యంతరం లేదు. అయితే కూటమిలో ఉన్న కొందరి నేతలకు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.

జాతీయ స్థాయిలో కూటమి…….

ముఖ్యంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పడినా రాష్ట్ర స్థాయిలో కలసి పోటీ చేసేందుకు ఎవరూ అంగీకరించని పరిస్థితి. పశ్చిమ బెంగాల్ విషయమే తీసుకుంటే అక్కడ కమ్యునిస్టులు మమతతో కలవని పరిస్థితి. కాంగ్రెస్ కు కూడా మమతతో కలసి పోటీ చేసే ఉద్దేశ్యం లేదు. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే అక్కడ ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మధ్య సీట్ల ఒప్పందం కుదిరిపోయింది. కాంగ్రెస్ కు కేవలం రెండు స్థానాలు మాత్రమే వదిలిపెట్టడంతో రాహుల్  గాంధీ ప్రియాంక  గాంధీని రంగంలోకి దించారు. ముందే కూటమికి మాయావతి, అఖిలేష్ లు అభ్యంతరం చెప్పే అవకాశాలున్నాయి. సో…ఇక్కడ రాష్ట్రంలో కలసి పోటీ చేసే పరిస్థితి లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో కేవలం పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరుగుతాయి.

రాష్ట్రాల్లో ఎవరికి వారే…..

ఇక దక్షిణాదిలో మాత్రం కొంత ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడే అవకాశాలున్నాయి. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ తో కూటమికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. ఇక కర్ణాటక విషయానికొస్తే అక్కడ ఆల్రెడీ జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ఉంది. కేరళలో కమ్యునిస్టు పార్టీ, కాంగ్రెస్ కలసి పోటీ చేసే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నా రాష్ట్ర స్థాయిలో పొత్తుకు విముఖం చూపుతున్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే కేసీఆర్ పోరాడుతున్నారు. ఆయన ఒంటరిగానే పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

ఎన్నికల తర్వాతే కూటమి నేత….

ఒడిశాలోనూ అదే పరిస్థితి. అక్కడ నవీన్ పట్నాయక్ ఒంటరిపోరుకే సిద్ధమైపోయారు. ఇలా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు కలసి పోటీ చేసే అవకాశం లేదన్నది సుస్పష్టం. కేవలం జాతీయ స్థాయిలో నేతలంతా ఒక్కటనట్లు సీన్ క్రియేట్ చేస్తారు కాని రాష్ట్ర స్థాయిలో మాత్రం విడివిడిగానే పోట ీచేసే అవకాశాలున్నాయి. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం లేకపోలేదు. దీన్ని ప్రధాని మోదీ ఆయుధంగా వాడుకునే అవకాశముంది. ఎన్నికలకు ముందే జాతీయ స్థాయిలో కూటమి ఏర్పడుతుంది కాని, కూటమి నేత ఎన్నికల అనంతరమే నిర్ణయిస్తామని మమత బెనర్జీ చెప్పడం గమనార్హం. మరి బీజేపీయేతర కూటమి ఎన్నికలకు ముందే ఏర్పడుతుందన్నది మాత్రం కొంచెం కష్టమైన విషయమేనన్నది విశ్లేషకుల అంచనా.

Ravi Batchali
About Ravi Batchali 37162 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*