అంత బలం ఉండి మూసుక్కూర్చుంటామా?
బీహార్ ఎన్నికలు పూర్తయినా అక్కడ రాజకీయ వాతావరణం మాత్రం నిత్యం టెన్షన్ గానే ఉంటుంది. అధికార, విపక్ష పార్టీలు ఇతర పార్టీల ఎమ్మెల్యేల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. [more]
బీహార్ ఎన్నికలు పూర్తయినా అక్కడ రాజకీయ వాతావరణం మాత్రం నిత్యం టెన్షన్ గానే ఉంటుంది. అధికార, విపక్ష పార్టీలు ఇతర పార్టీల ఎమ్మెల్యేల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. [more]
బీహార్ ఎన్నికలు పూర్తయినా అక్కడ రాజకీయ వాతావరణం మాత్రం నిత్యం టెన్షన్ గానే ఉంటుంది. అధికార, విపక్ష పార్టీలు ఇతర పార్టీల ఎమ్మెల్యేల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కు తక్కువ స్థానాలతో బీజేపీ అధికారంలోకి రావడం, తక్కువ సీట్లతో ఆర్జేడీ అధికారాన్ని కోల్పోవడమే ఇందుకు కారణంగా చెప్పాలి. ఆర్జేడీ ఇప్పటికే జేడీయూ ఎమ్మెల్యేలు తమ వైపు చూస్తున్నారని, 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు తమ వెంట వస్తారని, ఆరు నెలల్లో అధికార మార్పిడి తప్పదని చెబుతున్నారు.
విరుగుడు చర్యలు…..
అయితే దీనికి విరుగుడుగా బీజేపీ చర్యలు ప్రారంభించనట్లే కనపడుతుంది. గత ఎన్నికల్లో తక్కువ స్థానాలు రావడం, జేడీయూ ఎమ్మెల్యేలకు నితీష్ కుమార్ నాయకత్వంపై నమ్మకం పోవడమే ఇందుకు కారణం. నితీష్ కుమార్ ను వీడి ఏ క్షణంలోనైనా కొందరు ఎమ్మెల్యేలు ఆర్జేడీ వైపు వెళ్లవచ్చన్న ఇంటలిజెన్స్ నివేదికతో బీజేపీ అప్రమత్తమయినట్లు తెలుస్తోంది. అందుకే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వలవేసినట్లు ప్రచారం జరుగుతుంది.
తక్కువ స్థానాల్లో…..
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ స్థానాల్లో విజయం సాధించింది. అందువల్లే ఆర్జేడీ అధికారానికి దూరమయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ వీళ్లను క్యాంప్ నకు తరలించింది. బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీజేపీ కన్నేసింది. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలకు కాషాయ కండువా కప్పడానికి రెడీ అయిందంటున్నారు.
శక్తికి మించిన పనే…..?
బీజేపీ నుంచి తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం శక్తికి మించిన పనేనని చెప్పాలి. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నతే భరత్ సింగ్ చేసిన కామెంట్స్ దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. జేడీయూ ఎమ్మెల్యేలు ఒకవేళ తోక జాడించినా ముందస్తు జాగ్రత్తగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. ఇందులో సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.