అదో తుత్తి.. కొద్ది రోజులు మాత్రమే?
టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది. అవినీతి ప్రభుత్వం అంతమవుతుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల తర్వాత [more]
టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది. అవినీతి ప్రభుత్వం అంతమవుతుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల తర్వాత [more]
టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది. అవినీతి ప్రభుత్వం అంతమవుతుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని ఆయన జోస్యం చెబుతున్నారు. ఇది శాపనార్థాలయితే పరవాలేదు కాని. జోస్యం మాత్రం కాకూడదు. ఎందుకంటే దుబ్బాక లో గెలిచిన ఊపుతో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీవైపు క్యూ కడతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
30 మంది జంప్ అట…
వారి లెక్క ప్రకారం దాదాపు 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వస్తారని చెబుతున్నారు. ఇది ప్రచారం మాత్రమే. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపు మొగ్గు చూపుతారని బీజేపీ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. తాము బలమైన ప్రతిపక్షంగా రాష్ట్రంలో మారతామని పదే పదే చెబుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా? అన్న సంగతిని మాత్రం బీజేపీ నేతలు విస్మరిస్తున్నారు.
అంత సాహసం చేస్తారా?
నిజానికి సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరూ అధికార పార్టీ నుంచి విపక్షం వైపు చూసే అవకాశం ఉండదు. అధికారంలో ఉండటానికే వారు ఎక్కువగా ఇష్టపడతారు. పైగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కేవలం హైదరాబాద్ కే పరిమితం. గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఈ ఫలితాల గురించి పెద్దగా పట్టదు. పట్టించుకోరు కూడా. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ముప్ఫయి మంది బీజేపీ లో చేరడమనేది కలలోనే ఊహించుకోవాలి తప్పించి ఆచరణలో సాధ్యం కాదన్నది బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి.
ప్రచారం వరకే…..
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలయి ఉండవచ్చు. అందుకు అనేక కారణాలున్నాయి. అధికార పార్టీపై వ్యతిరేకత కూడా కొంత కారణం కావచ్చు. అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు అయి ఉండవచ్చు. అంత మాత్రాన టీఆర్ఎస్ తుడిచిపెట్టుకు పోతుందనయితే నమ్మేంతటి నేతలు ఆ పార్టీలో ఎవరూ లేరనే చెప్పాలి. బీజేపీ ప్రచారం చేసుకోవడానికి, కొంతకాలం సంతృప్తి పడటానికి మాత్రం ఇది ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.