ఈయన విషయంలో బాబు ఆలోచన మారిందా?

bojjalagopalakrishnareddy chandrababunaidu

ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మంత్రిగా పని చేసిన తెలుగుదేశం పార్టీలో సుధీర్ఘ‌మైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు కోసం ఇప్పుడు టీడీపీలో మూడు ముక్కలాట జరుగుతోంది. బొజ్జల అనారోగ్యంతో ఉన్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం జరిగిన మంత్ర వర్గ ప్రక్షాళనంలోనూ ఆయన ఇదే కారణాన్ని సాకుగా చూపి తప్పించారు. అప్పట్లో ఆయన తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని అలకబూనినా పరిస్థితులు సద్దుకున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో బొజ్జల తాను పోటీ చెయ్యనని తన కుమారుడు సుధీర్‌ రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. బొజ్జల ఆలోచన ఎలా ఉన్నా చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో సారి బొజ్జలనే పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. 1989 నుంచి 2004 వరకు వరసగా టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన 2004 కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌సీవీ. నాయుడు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి ఆయన 2009, 2014 ఎన్నికల్లో వరస విజయాలు సాధించారు.

నాయుడు కూడా….

ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు కేబినెట్‌లో రెండు సార్లు మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం బొజ్జల వయస్సు 7 దశాబ్దాలు దాటడంతో గతంలో ఉన్నట్టుగా ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సుధీర్‌ రెడ్డిని పోటీ చేయించాలని భావించి ఆయన నియోజకవర్గ పగ్గాలు ఇప్పటికే సుధీర్‌ రెడ్డికి అప్పగించారు. అటు బొజ్జల వ‌ర్గీయులు కూడా వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి సీటు సుధీర్‌రెడ్డిదే అని బాహాటంగా చర్చించుకుంటున్నారు. అయితే 2014 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఎన్‌సీవీ. నాయుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున శ్రీకాళహస్తిలో పోటీ చెయ్యాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయనకు సీటు ఇస్తే….

వీరిద్దరితో పాటు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం 15 ఏళ్లుగా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వివాద‌ రహితుడిగా పేరు ఉండడంతో పాటు తనకంటూ పార్టీలో ఒక వర్గాన్ని ఏర్పర్చుకున్న ఆయన రాష్ట్ర కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. వన్నెకులక్ష త్రియ(బీసీ) సామాజికవర్గానికి చెందిన ఆయనకు నియోజకవర్గంలో ఓ మోస్తరు పట్టుంది. బీసీ సామాజికవర్గం కోటాలో సుబ్రమణ్యం సైతం సీటు ఆశిస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఆయనకు 28,000 ఓట్లు వచ్చాయి. సిపాయి సుబ్రమణ్యం సామాజికవర్గానికి చెందిన వన్నెకుల క్షత్రియులు చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో బలంగా ప్రభావం చూపనున్నారు. సీఎం చంద్రబాబు ప్రాధినిత్యం వహించే కుప్పం నియోజకవర్గంలో 85,000 ఓటర్లు ఉండగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 65,000 ఓటర్లు ఉన్నారు. సిపాయికి సీటు ఇస్తే జిల్లాలో ఈ సామాజికవర్గం పట్టున్న మిగిలిన నియోజకవర్గాలు కూడా ఓటు బ్యాంకు టీడీపీకి అనుకూలంగా ప్రభావితం అవుతుందని ఆ సామాజికవర్గం నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

బాబు నిర్ణయంపైనే….

తంబళ్ల‌పల్లి సీటును మారిస్తే జిల్లాల్లో బీసీలకు టిక్కెట్‌ ఇవ్వాల్సి వస్తే అందుకు శ్రీకాళహస్తి బలమైన ఆప్షన్‌గా ఉందని సుబ్రమణ్యం సైతం తాజాగా స్పష్టం చేశారు. దీనిని బట్టీ ఆయన కూడా తాను శ్రీకాళహస్తి టీడీపీ రేసులో ఉన్నానన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు అయ్యింది. అలాగే అధిష్టానం సీటు ఇస్తే తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన ప్రకటించారు. మరి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లోనూ కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఏదోలా బొజ్జలపై ఒత్తిడి చేసి ఆయన్నే నిలబెడతారా ? లేదా బొజ్జల తాను తప్పుకుని ఆయన కుమారుడికి సీటు ఇప్పించుకునే విషయంలో సక్సెస్‌ అవుతారా ? లేదా టిక్కెట్‌ కోసం కాచుకుని కూర్చుని ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎన్‌సీవి. నాయుడు సక్సెస్‌ అవుతారా ? లేదా బీసీ కోటాలో సుబ్రమణ్యం గేలానికి సీటు చిక్కుతుందా ? అన్నది చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 21563 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*