బొత్స ఆయన్ను బలిపశువును చేశారా?

bostha satynarayana ysrcongressparty

విజయనగరం జిల్లా అంటే రాజకీయాల్లో గుర్తొచ్చే పేర్లు రెండే రెండు. ఒకటి అశోక్ గజపతి రాజు కాగా…రెండో పేరు బొత్స సత్యనారాయణ. అయితే తన బంధువులకు టిక్కెట్లు ఇప్పించుకోవడం కోసం బొత్స తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో అధిక సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఏడాదిన్నర పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే… సీట్ల కోసం నేతలను మారుస్తూ బొత్స తనదైన పాలిటిక్స్ ను నడుపుతున్నారన్న విమర్శలు జిల్లాలో జోరుగా విన్పిస్తున్నాయి. ఇందుకు శృంగవరపు కోటలో జరుగుతున్నదే నిదర్శనం. ఎస్ కోటలో వైసీపీకి మంచి ఆదరణ ఉంది. గత ఎన్నికల్లో ఓటమిపాలయినా ఈసారి ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఉంది.

ఇన్ ఛార్జిలను మార్చి…..

అయితే బొత్స సత్యనారాయణ నెరిపిన రాజకీయంతో ఫ్యాన్ పార్టీకి ఎస్ కోట నియోజకవర్గం సీటు దక్కేలా లేదు. ఇప్పటికే ఎస్ కోటలో నలుగురు ఇన్ ఛార్జులను మార్చారు. ఎస్ కోట నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోళ్ల లలితకుమారి ఉన్నారు. ఆమెకు ధీటైన అభ్యర్థిని నిలబెట్టాల్సిన తరుణంలో బొత్స తన రాజకీయంతో కడుబండి శ్రీనివాసరావును కన్వీనర్ గా నియమించుకున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గజపతినగరం నియోజకవర్గంలో తన సోదరుడు అప్పలనరసయ్య సీటుకు అడ్డుతగలకుండా ఉండేందుకే కడుబండి శ్రీనివాసరావును ఎస్ కోట ఇన్ ఛార్జిగా నియమించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇప్పటికి నలుగురు….

ఎస్ కోట నియోజకవర్గంలో గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆర్. జగన్నాధం పోటీ చేసి ఓడిపోయారు. అయితే కొంతకాలం తర్వాత జగన్నాధంను ఇన్ ఛార్జి నుంచి తొలగించి నెక్కలి నాయుడు బాబును నియమించారు. కొంతకాలం తర్వాత ఆయన్ను కూడా ఇన్ ఛార్జి పదవి నుంచి వైసీపీ అధిష్టానం తొలగించింది. ఆయన స్థానంలో అల్లు జోగినాయుడిని నియమించింది. అయితే జగన్ పాదయాత్ర సందర్భంగా మరోసారి ఇన్ ఛార్జిని మార్చారు. కడుబండి శ్రీనివాసరావును గజపతినగరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ నియమించారు. అయితే కడుబండి ఇక్కడ స్థానికేతరుడనే ముద్ర ఉంది.వాస్తవానికి అల్లు జోగినాయుడికే ఇక్కడ సామాజిక పరంగా, బంధుత్వం పరంగా గట్టి పట్టుంది. ఆయన స్థానంలో కడుబండిని నియమించడంతో వైసీపీలో అసంతృప్తి బయలుదేరింది.

కోళ్ల గెలుపు ఖాయమా…?

దీనికి ప్రధానకారణం బొత్స సత్యనారాయణ అన్నదిపార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న మాట. తన సోదరుడు అప్పల నర్సయ్యకు పార్టీలో పోటీ లేకుండా చేసుకోవడం కోసమే బొత్స కడుబండిని ఎస్ కోట కు షిఫ్ట్ చేశారంటున్నారు. పాదయాత్రకు అయ్యే ఖర్చు అల్లు జోగినాయుడు భరించలేరన్న సాకును చూపి బొత్స ఇలా చేశారన్నది పార్టీ వర్గాలే బాహాటంగా చెప్పుకుంటున్నాయి. దీంతో రెండు సార్లు వరుసగాగెలిచి హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకోళ్ల లలితకుమారి గెలుపునకు మార్గం సుగమమయిందంటున్నారు. మొత్తం మీద ఫ్యాన్ పార్టీలో ఈ గ్రూపు విభేదాలే చేటుతెచ్చేటట్లుంది.

Ravi Batchali
About Ravi Batchali 39148 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*