చంద్రబాబును ఏకాకిని చేశారా?

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. చేసుకున్నంత వారికి చేసుకున్నంత… అన్న సామెత చంద్రబాబుకు అక్షరాలా వర్తిస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు పిలుపు అంటేనే అన్ని పార్టీలూ ఉత్సాహ పడేవి. కాని ఇప్పుడు చంద్రబాబు పిలిచినా రామంటే రామంటున్నారు. ముఖ్యమంత్రిగా, ఒక పార్టీకి అధినేతగా చంద్రబాబుకు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో విపక్షాల నుంచి సహకారం అందడం లేదు. అసలు ఒక ముక్కలో చెప్పాలంటే చంద్రబాబుకు ఇప్పుడు మిత్రుడనే వాడే లేకుండా పోయాడు.

రేపటి సమావేశానికి……

తాజాగా రెండోసారి అఖిలపక్ష సమావేశాన్ని రేపు ఏర్పాటు చేశారు చంద్రబాబు. పార్టీ అధినేతగా కాకుండా ముఖ్యమంత్రిగా ఈ అఖిపక్షాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని పార్టీలకూ ఆహ్వానం పంపారు. అయితే ఏ పార్టీ కూడా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం విశేషం. గత అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు హాజరయ్యారు. వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు గైర్హాజరయ్యాయి.

మేం రామంటున్న…..

తాజాగా చంద్రబాబు పంపిన ఆహ్వానాన్ని కూడా దాదాపు అన్ని పార్టీలూ తిరస్కరించాయనే చెప్పొచ్చు. చంద్రబాబు పై తమకు నమ్మకం లేదని, అఖిపక్షం పేరుతో మరోసారి హోదాను తాకట్టు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తాము సహకరించమని వైసీపీ చెబుతోంది. అఖిపక్షానికి హాజరు కావడం లేదని వైసీపీ తేల్చి చెప్పింది. అలాగే బీజేపీ కూడా తాము రావడం లేదని చెప్పేసింది. ఇక నిన్న మొన్నటి వరకూ మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ కూడా అఖిలపక్షం ఒక వృధా సమావేశంగా అభివర్ణించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇక గత సమావేశాలకు వెళ్లిన సీపీఎం, సీపీఐ కూడా అఖిపక్షానికి వెళ్లడం లేదని తేల్చి చెప్పాయి. అజెండా పంపకుండా సమావేశానికి పిలిస్తే అర్థమేంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఒక్క మిత్రుడూ లేరే….

చంద్రబాబుకు ఇప్పుడు ఏపీలో ఒక్క మిత్రుడూ లేడని దీన్ని బట్టి అర్థమయిపోయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. చంద్రబాబు నాలుగేళ్లు నాన్చి….నాన్చి ఎన్నికల ముందు యూటర్న్ తీసుకోవడాన్ని అన్ని పార్టీలూ తప్పుపడుతున్నాయి. కేవలం మరోసారి గెలిచేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లి పార్లమెంటు సెంట్రల్ హాలులో కేవలం పిచ్చాపాటీ మాట్లాడి వచ్చిన చంద్రబాబు సాధించేది ఏదీ లేదని, తాము చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని, ఆ పరిస్థితిని ఆయనే తెచ్చుకున్నారంటున్నారు. తొలుత ప్యాకేజీ కి అంగీకరించడం, హోదా ఉద్యమానికి దిగిన వారిపై కేసులు పెట్టడం వంటి విషయాలను వారు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం చెప్పకపోయినప్పటికీ… చంద్రబాబు రేపటి అఖిపక్ష సమావేశంలో ఏవో కొన్ని సంఘాలు మినహా ఏకాకిగానే మిగులతారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 22708 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*