బాబు అంటే లెక్క చేయ‌ని మంత్రి, ఎమ్మెల్యే

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీలో గ‌తంలో ఉన్న క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పోలిస్తే ఇప్పుడు 10 శాతం క్ర‌మ‌శిక్ష‌ణ కూడా లేదు. చంద్ర‌బాబు అంటే సీనియ‌ర్లు సైతం రూల్స్ బ్రేక్ చేసేందుకు ఇష్ట‌ప‌డేవారు కాదు. అధిష్టానం, చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా చిన్న మాట కూడా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు బాబు మాటంటే కొత్త వారికే కాదు…. స‌బ్ జూనియ‌ర్లు కూడా లెక్క చేయ‌ని ప‌రిస్థితి. ఏపీలో క‌ర్నూలు జిల్లా టీడీపీలో గ్రూపులు, కుమ్ములాట‌ల రాజ‌కీయాల‌కు బ్రేక్ ప‌డ‌డం లేదు. చంద్ర‌బాబు ఎన్నిసార్లు పంచాయితీలు చేసినా ఆయ‌న మాటంటే అక్క‌డ మంత్రులు, ఎమ్మెల్యేలు లెక్క‌లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా సీఎం చంద్ర‌బాబు న‌వ‌నిర్మాణ దీక్ష సంద‌ర్భంగా క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించారు. జిల్లాలోని జొన్న‌గిరిలో న‌వ‌నిర్మాణ దీక్షకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు జిల్లాకు చెందిన మంత్రి భూమా అఖిల‌ప్రియ‌తో పాటు బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న్‌రెడ్డి డుమ్మా కొట్టారు. వీరిద్ద‌రితో పాటు మ‌రికొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు కూడా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు రాలేదు. దీనిని బ‌ట్టి బాబు అంటే వారు లెక్క‌లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని… త‌మ డిమాండ్లు నెర‌వేర్చ‌క‌పోతే తాము అంతే అన్న‌ట్టుగా ఉంటామ‌ని తేల్చి చెప్పిన‌ట్ల‌య్యింది.

మంత్రి అఖిల‌ప్రియ చంద్ర‌బాబు ప‌ట్ల అసంతృప్తితో ఉన్నారు. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఏవి.సుబ్బారెడ్డి జోక్యం ప‌ట్ల ఆమె గుర్రుగా ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల టైం నుంచి వీరి మ‌ధ్య స‌యోధ్య‌కు చంద్ర‌బాబు రెండు మూడు సార్లు పంచాయితీలు చేసినా అవి ఫెయిల్ అయ్యాయి. అయినా ఎవ‌రికి వారు త‌మ వ్య‌క్తిగ‌త విబేధాల‌ను ప‌క్క‌న పెట్ట‌లేదు. ఈ ఎఫెక్ట్ నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్రంగానే క‌నిపిస్తోంది. ఇక గోదావ‌రి ప‌డ‌వ ప్ర‌మాద స‌మ‌యంలోనూ ఆమె క‌నిపించ‌లేదు.

ఆ త‌ర్వాత చంద్ర‌బాబును క‌లిసి త‌న పెళ్లి ప‌త్రిక అంద‌జేసిన అఖిల మంత్రిగా త‌న స్థాయికి త‌గిన‌ట్టు పెర్పామ్ చేయ‌డం లేదు. ఆమె రాష్ట్రానికి మంత్రిగా ఉన్న క‌నీసం జిల్లా రాజ‌కీయాల్లోనూ త‌న ముద్ర వేయ‌లేక‌పోతున్నారు. తాజాగా ఇప్పుడు ఏకంగా చంద్ర‌బాబు స‌మావేశానికే డుమ్మా కొట్ట‌డంతో ఆమె వ్య‌వ‌హార శైలీపై ప‌లు సందేహాలు పార్టీ వ‌ర్గాల్లోనే వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాబు మాట‌ను ఆమె ఏ మాత్రం ఖాతారు చేయ‌లేదా ? అనిపిస్తోంది.

జ‌నార్థ‌న్‌రెడ్డి ప్రాబ్ల‌మ్ ఏంటి..
ఇక బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే బిసి.జనార్థ‌న్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో భారీగా ఖ‌ర్చు చేసి విజ‌యం సాధించారు. పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కు ఇమేజ్ ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న గెలుపులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామ‌ని ఆయ‌న హామీ ఇప్పించారు. ఇప్ప‌టికే పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మూడు నాలుగు సార్లు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగాయి. క‌ర్నూలు ఎమ్మెల్సీ సీటుకు ఏకంగా రెండుసార్లు ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయినా చ‌ల్లా కోరిక మాత్రం తీర‌లేదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో చ‌ల్లా స‌పోర్ట్ లేక‌పోతే అది జ‌నార్థ‌న్‌రెడ్డి గెలుపుపై ప్ర‌భావం చూపుతుంది. దీంతో అల‌క‌బూనిన ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మినీ మ‌హానాడే నిర్వ‌హించ‌లేదు. ఇదే ఓ పెద్ద షాక్ అనుకుంటే జిల్లా మ‌హానాడుతో పాటు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన రాష్ట్ర మ‌హానాడుకు కూడా ఆయ‌న డుమ్మా కొట్టి చంద్ర‌బాబు, అధిష్టానానికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబు పర్యటనకు పార్టీ ఎమ్మెల్యే గైర్హాజరు కావడం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

ఈ ఇద్ద‌రితో పాటు జిల్లాలో అసంతృప్తితో ఉన్న మరికొంద‌రు నాయ‌కులు కూడా బాబు ప‌ర్య‌ట‌న‌కు డుమ్మా కొట్టారు. ఓవ‌రాల్‌గా చూస్తే టీడీపీలో త‌మ డిమాండ్లు, కోరిక‌లు నెర‌వేర‌క‌పోతే చంద్ర‌బాబును సైతం అయినా సీనియ‌ర్లు, జూనియ‌ర్లు, స‌బ్ జూనియ‌ర్లు అనే తేడా లేకుండా అంద‌రూ లెక్క‌చేసే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. మ‌రి చంద్ర‌బాబు వీరిని ఎలా గాడిలో పెడ‌తారో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*