బాబు మరో రూట్ సిద్ధం చేసి పెట్టుకున్నారా?

చంద్రబాబు

చంద్రబాబుని అందుకే గండరగండడు అన్నారు. ఆయన రేపటి రోజున ఏం జరుగుతుందో ఊహిస్తారు. ఒకవేళ అలా జరగకపోయినా మరో రూట్ ని కూడా రెడీ చేసి సిద్ధంగా పెట్టుకుంటారు. తాను అనుకున్నది జరగలేదని నిరాశ పడరు సరికదా ఫలితం వచ్చేంతవరకూ పరితపిస్తారు. అదే చంద్రబాబుని ఎక్కడో చంద్రగిరిలో ఎమ్మెల్యే స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ తీసుకువచ్చింది. ఏపీలో ఇప్పటికిపుడు చూస్తే రాజకీయం అంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంది. అది ఆయనకూ తెలుసు. ఒక వైపు వైసీపీ కత్తులు నూరుతోంది. సోము వీర్రాజు ప్రెసిడెంట్ అయ్యాక బీజేపీ మొత్తానికి మొత్తం యాంటీ అయింది. తోడుగా జనసేన కూడా పొత్తులో ఉంది. దాంతో చంద్రబాబు గొంతు వినిపించకుండానే పొలిటికల్ కధ నడిపించేస్తున్నారు.

ఎన్నాళ్ళు అలా …..

ఏపీలో బీజేపీ ఊపూ సోము వీర్రాజు మోజు ఎంతకాలం అన్నదే ఇపుడు టీడీపీలో చర్చగా ఉందిట. వచ్చే ఏడాది జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ మాత్రం రిజల్ట్ చూపించకపోయినా సోము వీర్రాజును మైనస్ మార్కులు అధినాయకత్వం వద్ద పడతాయి అని అంచనాలు వేస్తున్నారుట. ఇదిలా ఉంటే ఏపీలో సోము వీర్రాజు వచ్చాక అతివాదం పెరిగింది. హిందూ కార్డు ఇపుడు జోరు చేస్తోంది. ఇది ఒక విధంగా జనసేనకు కూడా ఇబ్బందిగా ఉంటుందని, స్వతహాగా ఆ భావజాలం లేని పవన్ కళ్యాణ్ ఎంతకాలం ఈ వీర హిందూయిజాన్ని మోస్తారని కూడా విశ్లేషణలు కూడా ఉన్నాయి.

పెటాకులు అయితే…..?

ఇక ఏపీలో బీజేపీ చిన్న పార్టీ. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి మోడీ లాంటి ప్రధాని ఉండొచ్చు, 300 కి పైగా ఎంపీలు ఉండొచ్చు. కానీ ఏపీలో బీజేపీకి నోటా కంటే కూడా తక్కువ ఓట్లే పడ్డాయన్నది నిజం. అదే సమయంలో జనసేనకు ఆరు శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, బలమైన సామాజిక వర్గం కూడా ఉన్నాయి. ఆయన అందరి వాడుగా రాజకీయాల్లో ఉండాలని ఆయన అభిమానులు అయితే కోరుకుంటున్నారు. కానీ పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకుని దీక్షలు చేయడం నచ్చని వారు ఆ పార్టీలో కూడా ఉన్నారుట. ఇవాళ కాకపోయినా రేపు అయినా బీజేపీలోని మేధావి వర్గం కానీ చదువరులు కానీ దీని మీద అసంత్రుప్తి గట్టిగా వ్యక్తం చేస్తే పవన్ తన రూటు మార్చుకోవాల్సిరావడం ఖాయం. ఇక పవన్ కూడా బీజేపీ పెద్దన్న పోకడల పట్ల కొంత ఆలోచన చేస్తున్నారని అంటున్న వారూ ఉన్నారు.

అదే కావాలిగా….?

వస్తే బీజేపీ, జనసేనా రెండూ కలసి రావాలి. అపుడు 2014 ఎన్నికల ఎన్నికల మాదిరిగా మళ్ళీ పొత్తు ఉంటుంది. లేకపోయినా ఎన్నికల వేళకు జనసేన అయినా కలసివస్తుందని టీడీపీకి తెగ నమ్మకమట. ఒకవేళ జనసేనను దగ్గరకు చేస్తే ఆటోమేటిక్ గా బీజేపీ కూడా వస్తుంది. లేకపోతే వారికి వేరే ఆప్షన్ లేదు అన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందని అంటున్నారు. బీజేపీతో పొత్తుకు వైసీపీ ఎటూ ఓకే చెప్పదు, ఇక మళ్లీ ఒంటరి పోరు చేయడానికి బీజేపీ అసలు సాహసించరు. ఈ రకమైన లెక్కలు దగ్గర ఉండబట్టే చంద్రబాబు ధీమాగా ఉన్నారుట. మొత్తానికి పొత్తుల ఎత్తులో తాను కింగ్ నని బాబు మరో మారు నిరూపించుకుంటారా. వెయిట్ అండ్ సీ.

Ravi Batchali
About Ravi Batchali 29939 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*