చంద్రబాబు సంకేతాలు దేనికి?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్ని చక్కగా ఉపయోగిస్తున్నారు. ప్రధాని మోడీపై ఎవరూ చేయని విధంగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు మోడీ తనకంటే జూనియర్ అన్న విషయాన్ని ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూ వెళుతున్నారు. మోడీతో పెట్టుకుంటే ఏదో జరిగిపోతుందన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానైనా కసి తీర్చుకునే అవకాశముంది. అలాగే పార్టీని కూడా మోడీ, అమిత్ షాలు విడిచిపెట్టరని తెలుసు. అందుకే తన ఎక్స్ పీరియన్స్ ను రంగరించి మరీ ముందుగానే కేంద్రం తనపైన, తన పార్టీని పెట్టబోయే ఇబ్బందులను ఆయన గుర్తించి నేతలను అప్రమత్తం చేస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత…..

కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీలోని కొందరు తెలుగుదేశం పార్టీ నేతలపై కేంద్రం దాడులు చేయించవచ్చని సూత్రప్రాయంగా సంకేతాలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఈ దాడులను ఆపారన్న సమచారం తనకు అందిందని, అక్కడ తెలుగు ఓట్లకు గండిపడటం ఇష్టంలేక నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తనకు తెలిసిందని చంద్రబాబు నేతలతో చెప్పుకొచ్చారు. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత మాత్రం ఖచ్చితంగా కొందరిపై సీబీఐ, ఈడీ వంటి దాడులు జరిగే అవకాశముందని ఆయన హెచ్చరించారు.

సిద్ధంగా ఉండాలని…

అయితే కేంద్రం పెట్టే ఏ ఇబ్బందులనైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నేతలను కోరారు. అధైర్య పడవద్దని, పార్టీ వారికి అండగా ఉంటుందని కూడా ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవల ఢిల్లీపర్యటనకు వెళ్లి వచ్చిన అనంతరం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇద్దరు మంత్రులపైన, ఇద్దరు ఎంపీలపైన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దాడులు జరిగే అవకాశం ఉందని తెలియడంతో ఆయన నేతలను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలన్న యోచనలో బీజేపీ ఉన్నట్లు తనకు తెలిసిందని చంద్రబాబు చెప్పారు.

భయపడేది లేదంటున్న…..

మోడీ సర్కార్ దాడులకు భయపడేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకోసమే సీబీఐ దాడులు జరగకముందే టీడీపీ నేతలు మాటల దాడులు పెంచారంటున్నారు. ఒకవేళ నిజంగా దాడులు జరిగితే తాము మోడీని వ్యతిరేకించబట్టే దాడులు జరిగాయని, రాష్ట్రంలో ఎక్కడా అవినీతి జరగలేదంటూ ప్రజలకు చెప్పుకునే వీలుంటుంది. అందుకోసమే మోడీ ఇంటి ముట్టడి వంటి కార్యక్రమాలను టీడీపీ నేతలు చేపట్టారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 41252 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*