ఓడిపోయేవారిని బాబు పక్కన పెట్టేశారా?

చంద్రబాబు ఓడిపోయే వారిని ముందుగానే సాగనంపినట్లు అర్థమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ నియోజకవర్గంలో పరిస్థితిని అంచనా వేసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని గట్టిగా భావిస్తున్న చంద్రబాబు ఈ మేరకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓటమి పాలవుతారని భావించిన కొందరికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చి వారిని సంతృప్తి పర్చడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతుంది.

పదవుల భర్తీ చూస్తే…..

తాజాగా కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీని చూస్తే ఇదే అర్థమవుతుంది. తన సర్వే నివేదికల ఆధారంగా ఆయన ఈ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్ కంటే డీఎల్ రవీంద్రారెడ్డి బెస్ట్ అని భావించిన చంద్రబాబు ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చి పంపించి వేశారు. ఇక ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత దివిశివరామ్ పరిస్థితి కూడా అంతే. ఆయన గెలుపు కష్టమని సర్వేలో తేలడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్న చంద్రబాబు ఆయనకు అటవీ శాఖ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవి ఇచ్చి పంపించివేశారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీ నుంచి పార్టీలో చేరిన పోతుల రామారావుకు, దివిశివరామ్ కు పడటం లేదు. ఈ సమస్య కూడా కొంత వరకూ తీరినట్లే.

టిక్కెట్ల విషయంలో ఇబ్బంది లేకుండా…..

ఇక కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఉప్పులేటి కల్పన గెలిచారు. ఉప్పులేటి కల్పనను ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీలో చేర్చుకున్నారు. గతఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు, ఉప్పులేటి కల్పన వర్గాలకు మధ్య పొసగడం లేదు. ఎన్నికల సమయంలో ఇది మరింత ముదిరే ప్రమాదముందని గ్రహించిన చంద్రబాబు వర్లరామయ్యను ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని వర్లకు ముందుగానే చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లయిందని చెబుతున్నారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి చేేరిన జూపూడి ప్రభాకర్ ను కూడా ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలోవ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూపూడి ప్రభాకర్ రావు గత ఎన్నికల్లో కొండపి నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీలోకి వచ్చిన ఆయన వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ అడగకుండా ఆయనను ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా కంటిన్యూ చేశారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇలా చంద్రబాబు ముందుగానే ఓటమి పాలవుతారని భావించిన వారికి పదవులు ఇచ్చి పక్కన పెట్టేశారన్నది టీడీపీలో టాక్.

Ravi Batchali
About Ravi Batchali 38942 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*