మారిపోయిన బాబు… షాక్ లో వైసిపి …?

chandrababunaidu ysrcongress party

ఎపి సిఎం చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ప్రపంచ బ్యాంక్ ముద్దు బిడ్డ చంద్రబాబు అంటూ కామ్రేడ్ లు పెట్టిన పేరు చెరుపుకునే పనిలో పడ్డారు ఆయన. కారణం జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే సర్వేల్లో బాబు వెనుకబడ్డారన్న సమాచారం ఆయనకు నిద్రపట్టకుండా చేస్తుంది. ప్రపంచ బ్యాంక్ షరతులను పూర్తిగా అనుసరించి గతంలో సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబేనా? ఇలా మారింది అని సొంత పార్టీ వారే ఆక్స్ర్య పోయేలా టిడిపి అధినేత సైకిల్ స్పీడ్ ను ఎన్నికల ముందు అమాంతం పెంచేశారు. విపక్ష పార్టీల హామీలను ఒక్కొటొక్కటిగా అమలు చేస్తూ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు ఎపి సిఎం. ఫలితంగా ఎన్నికల సమరంలో పై చేయి సాధించడానికి అవసరమైన అన్ని ఆయుధాలను శరవేగంగా సముపార్జించే పనిలో ఇప్పుడు బాబు టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు.

పింఛన్లతో మొదలు పెట్టి …

వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు మొదలు కొని అందరికి పెన్షన్లు డబుల్ ఒక్కసారిగా చేశారు చంద్రబాబు. నిజానికి తాము అధికారంలోనికి వస్తే ఇవన్నీ పెంచుతామని జగన్ హామీలు ఇస్తూ పాదయాత్ర సాగించారు. ఇక డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 10 వేలరూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించి మరో సంచలనం సృష్ట్టించారు. ఇక ఉద్యోగ వర్గాలపైనా వరాలు కురిపిస్తున్నారు. కులాల వారీగా హామీల జడివాన సరేసరి. బిసిలు పార్టీకి దూరం జరుగుతున్నారని గుర్తించి జయహో బిసి అంటూ మరిన్ని వరాలు ఆయా వర్గాలపై కురిపించేందుకు సిద్ధమయ్యారు. ఇలా అడిగినవి… అడగనివి అన్ని ఇచ్చేసి తాడో పేడో ఎన్నికల్లో తేల్చుకోవాలని చంద్రబాబు చక్కటి వ్యూహంతో సాగుతున్నారు.

వైఎస్, కెసిఆర్ బాటలో …

ఏపీలో సంక్షేమ కార్యక్రమాల పేరు చెప్పగానే స్వర్గీయ వైఎస్ఆర్ ప్రజలకు గుర్తుకు వచ్చే నేత. ఆ తరువాత అదే బాటలో తెలంగాణ సిఎం కెసిఆర్ సైతం తనదైన శైలిలో సామాన్యులకు పెదబలహీన వర్గాలను ఆకట్టుకునేలా సంక్షేమం తారక మంత్రంగా సాగిపోయారు. అయితే వీరి శైలికి భిన్నంగా ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు పాలన సాగింది. విద్యుత్ చార్జీల నుంచి అనేకం పెంచి రాష్ట్రాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు గతంలో 9 ఏళ్ళు బాబు పాలన కృషి చేశారు. కానీ ఇవేమి ఓట్లు రాల్చవని 2004 లో ఓటమి ఆయనకు గుర్తు చేసింది. దాంతో ఇప్పుడు బాబు సైతం సంక్షేమమే తమ ప్రభుత్వంపై వీస్తున్న వ్యతిరేక పవనాలకు తారక మంత్రంగా గుర్తించి ఎవ్వరు ఊహించని విధంగా నిర్ణయాలు ప్రకటిస్తూ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సాగుతున్నారు. మరి నిన్ను నమ్మం బాబు అంటున్న వైసిపి ని ఈ నేపథ్యంలో నమ్ముతారా లేక టిడిపికి తిరిగి అధికారం ఇచ్చేందుకే జనం మొగ్గు చూపుతారా ? అన్నది వేచి చూడాలి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1292 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*