డీఎస్ కండిషన్లు ఇవేనట…..!

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమయింది. డి శ్రీనివాస్ కు కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధం ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. టీఆర్ఎస్ లో ఆయనకు తొలుత ప్రభుత్వ సలహాదారుగా, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారు. అయితే ఆయన సొంత జిల్లా నిజామాబాద్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆయనను ఇబ్బంది పెట్టేవి గా మారాయి. సాక్షాత్తూ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలందరూ కలసి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి మరీ కేసీఆర్ కు పంపించారు. దీంతో డీఎస్ తీవ్ర మనస్థాపం చెందారు.

భవిష్యత్ కార్యాచరణపై……

తాను కాంగ్రెస్ లో చేరే ప్రసక్తి లేదని పదే పదే చెబుతున్నా తనపై బురద జల్లే కార్యక్రమాన్ని కొందరు పెట్టుకున్నారని డీఎస్ ఆరోపించారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ను కలసి వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆయనకు కేసీఆర్ దాదాపు మూడు నెలల నుంచి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఇటీవల తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమైన డీఎస్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనుచరులంతా తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లాలని సూచించారు. దీంతో డీఎస్ కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది.

ఈనెల 27న కీలక ప్రకటన…..

డీఎస రాకకు కాంగ్రెస అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేరుగా ఢిల్లీలో సోనియా సమక్షంలో చేరాలని డీఎస్ నిర్ణయించారు. ఈ నెల 27వ తేదీన డి.శ్రీనివాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన చేసే అవకాశముంది. కాంగ్రెస్ లో చేరితే రాజ్యసభ పదవికి కూడా డీఎస్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకు కూడా డీఎస్ సిద్ధమయినట్లు చెబుతున్నారు. ఒకరు ఇచ్చిన పదవి తనకు వద్దని, పార్టీ మారిన వెంటనే రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని తన సన్నిహితుల వద్ద ఆయన అన్నట్లు తెలుస్తోంది.

రెండు సీట్లు ఇవ్వాలంటూ…..

అయితే పార్టీలో చేరితే డీఎస్ భవిష్యత్ ఏంటన్న చర్చకూడా జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు డీఎస్ రాకను వ్యతిరేకిస్తున్నారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి డీఎస్ వస్తున్నారని తెలిసే టీఆర్ఎస్ లోకి వెళ్లారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే డీఎస్ మాత్రం తాను పార్టీలో చేరితే నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ టౌన్ టిక్కెట్లను తాను చెప్పిన వారికే ఇవ్వాలని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవి వదులుకుని వస్తున్నందున కనీసం తన మాటకు విలువిస్తే గౌరవముంటుందని ఆయన కాంగ్రెస్ పెద్దల వద్ద చెప్పినట్లు సమాచారం. నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి, నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ తనకు గాని, తన కుమారుడు సంజయ్ కు గాని ఇవ్వాలని చెప్పారని, అయితే దీనిపై డీఎస్ కు హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించలేదంటున్నారు. మొత్తం మీద డీఎస్ చేరిక దాదాపు ఖాయమైంది. మరి ఆయన షరతులకు అధిష్టానం తలొగ్గుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 37873 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*