ఆ మాజీ మంత్రి సైకలెక్కడం ఖాయమే..!!

dadi veerabhadrarao return to telugudesam party

రాజకీయ అవసరాలు చంద్రబాబుకి తెలిసినంతగా ఎవరికీ తెలియవంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పటికి ఏది అవసరమో దాన్ని అమలు చేసి అనుకున్నది సాధించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఎవరినీ కాదనుకోరు. అలాగని అవసరం లేకపోతే ఎవరినీ నెత్తిన పెట్టుకోరు కూడా. విషయమేంటంటే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పూర్వాశ్రమం టీడీపీనే. బాబు కంటే సీనియర్ అయిన దాడి కొన్ని కారణాల వల్ల 2012లో టీడీపీని వీడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు. 2014 ఎన్నికల్లొ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దాడి కుమారుడు రత్నాకర్ ఘోర పరాజయం పాలయ్యారు. దాంతో దాడి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఏ పార్టీకీ చెందని వ్యక్తిగా ఉంటున్న దాడి రాజకీయ ప్రవేశంపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది.

అనూహ్య కలయిక….

ఇదిలా ఉండగా విశాఖలో తాజాగా జరిగిన మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమార్తె వివాహం సందర్భంగా దాడి వీరభద్రరావు హాజరయ్యారు. ఆ పెళ్ళికి వచ్చిన చంద్రబాబుకు దాడి అలా అనుకోకుండా తారసపడ్డారు. దాంతో చంద్రబాబును చూసిన దాడి లేచి నిలబడి పలకరించారు. బాబు సైతం ఆయన్ని ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేశారు. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి దాడి మన పాత మిత్రుడు బాబు గారు అంటూ చెప్పబోతే బాబు అడ్డుకుంటూ పాత, కొత్త లేదు. ఆయన మంచి మిత్రుడంటూ కితాబు ఇవ్వడం రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. ఇదే సందర్భంలో మంత్రి కళా వెంకటరావు కూడా కల్పించుకుని దాడి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని బాబుకు చెప్పగా బాబు సైతం ఒకే అలాగే కలుద్దామని చెప్పడమే కాదు, దాడిని వెంటబెట్టుకుని తన వద్దకు రావాలని కోరడంతో దాడి టీడీపీలో చేరిక లాంఛనమేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

గతంలోనే ప్రయత్నాలు…

ఇదిలా ఉండగా దాడి గతంలోనే టీడీపీలోకి ప్రవేశించేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. ఆయన్ని పార్టీలో చెర్పించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తన వంతుగా కృషి చేశారు. అయితే దాడి రాకను జిల్లాకు చెందిన మరో మంత్రి అయ్యన్నపాత్రుడు బలంగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నం అలా ఆగిపోయింది. దాంతో దాడి జనసేన వైపు వెళ్తారని కూడా ప్రచారం సాగింది. అయితే మళ్ళీ ఈసారి నేరుగా బాబుతోనే దాడి కలయిక జరగడం, చంద్రబాబు కూడా చేర్చుకునేందుకు సుముఖంగా ఉండడంతో ఈసారి మాజీ మంత్రి సైకిలెక్కడం ఖాయమేనా అన్న చర్చ విశాఖ జిల్లాలో సాగుతోంది. మొత్తానికి దాడి చేరిక వల్ల విశాఖ జిల్లా టీడీపీలో రాజకీయ సమీకరణలు ఏ మలుపు తిరుగుతాయన్నది కూదా చూడాలంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 30044 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*