దాడిని వెంటాడుతున్న భయం అదేనా…??

dadi veerabhadrarao struggling with parties

మాజీ మంత్రి, సీనియర్ నేతకు రెండు పార్టీల నుంచి ఆఫర్లున్నాయా? ఏ పార్టీకి వెళ్లాలన్నదానిపైనే ఆయన ఆలోచిస్తున్నారా? ఉత్తరాంధ్రలో బలమైన నేతగా దాడి వీరభద్రరావు ఎదిగారు. ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాడు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అప్రతిహతంగా ఒక వెలుగు వెలిగారు. తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా ఉన్న ఆయన తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. వరసుగా అనకాపల్లిలో 1989,1994, 1999 ఎన్నికల్లో ఆయన వరుసగా విజయం సాధించి రికార్డులను అధిగమించారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీని వీడి జగన్ కు జైకొట్టారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో జగన్ పార్టీని కూడా వీడారు. ప్రస్తుతం దాడి వీరభద్రరావు ఏ పార్టీలో లేరు. అనకాపల్లిని మాత్రం రాజకీయంగా వదిలేది లేదని దాడి అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.

సమీకరణలు మారడంతో…..

అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ముఖాముఖి తలపడతాయని భావిస్తే ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రభావం చూపుతుందన్న అంచనాలయితే బాగానే విన్పిస్తున్నాయి. దీంతో దాడికి కూడా బాగా గిరాకీ పెరిగింది. రాజకీయంగా తాను, తన కుమారుడు నిలదొక్కుకోవడానికి దాడి దారులు కొన్నాళ్లుగా వెతుక్కుంటున్నారు.

నాలుగేళ్లుగా ఖాళీగా ఉండి……

వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాడి వీరభద్రరావు గత నాలుగేళ్లుగా రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు. తొలుత దాడి వీరభద్రరావు తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లాలనిచూశారు. తొలుత పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అంగీకరించలేదని వార్తలొచ్చాయి. అయితే ఇటీవల కాలంలో దాడిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై అసంతృప్తి ఎక్కువగా ఉండటం, భూ ఆక్రమణల ఆరోపణలు ఉండటంతో దాడిని తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన పార్టీ జిల్లా నేతల ముందు చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే త్వరలోనే దాడికి టీడీపీ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతుంది.

జనసేనా? టీడీపీయా?

మరోవైపు జనసేన నుంచి కూడా ఆహ్వానం ఎటూ ఉండనే ఉంది. దాడి వీరభద్రరావు ఇంటికి స్వయంగా వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ ఆయనతో రాజకీయ చర్చలు జరపడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. పవన్ స్వయంగా తన ఇంటికి రావడంతో ఆయన జనసేనలోకి వెళతారని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేపై అసంతృప్తితో తన కుటుంబానికే సీటు ఇస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రజల్లో అసంతృప్తి ఉన్న టీడీపీలోకి వెళితే మరోసారి ఓటమి పాలవుతామేమోనన్న భయం దాడిని వెంటాడుతుంది. జనసేనలోకి వెళ్లినా అది అధికారంలోకి రావడం కష్టం. మరి ఈ రెండు పార్టీల్లో ఏది చేరాలన్న మీమాసంలో దాడి ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దాడి త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 23541 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*