దాడి…దాటుకుని వెళ్లారుగా….!!

dadi-veerabhadrarao-ysrcongress-party

ముగ్గురూ ఉద్దండులైన నేతలే. ప్రజల్లో పట్టున్న వారే. సీనియారిటీకి ఏమాత్రం కొదవలేదు. అందువల్లనే ఈ ముగ్గురి కోసం అన్ని పార్టీలూ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంచుతాయి. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల ముందు ముగ్గురు అగ్రనేతలు చేసిన సర్కస్ ఫీట్లు జనాలకు నవ్వు తెప్పించాయి. అయితే ఈ ముగ్గురి నేతల్లో ఒకరు మాత్రమే సక్సెస్ కాగా, మరో ఇద్దరు మాత్రం రాజకీయంగా మరో ఐదేళ్ల పాటు తెరమరుగుకానున్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు అగ్రనేతలైన దాడి వీరభద్రరావు, సబ్బం హరి, కొణతాల రామకృష్ణలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తీసుకున్ననిర్ణయాలు ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది.

నాలుగున్నరేళ్లు ఖాళీగా ఉండి….

దాడి వీరభద్రరావు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.జగన్ మీద విమర్శలు కూడా కురిపించారు. గత నాలుగున్నరేళ్ల నుంచి ఆయన ఖాళీగానే ఉన్నారు. ఏ పార్టీలో చేరలేదు. ఆయనకు టీడీపీ నుంచి జనసేన నుంచి ఆఫర్లు వచ్చినా తిరిగి వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపారు. ఎన్నికలకు ముందు ఆయన, కుమారుడు దాడి రత్నాకర్ లు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

పదవి ఖాయం…..

దాడి రత్నాకర్ ను అనకాపల్లి నుంచి పోటీ చేయాలని జగన్ కోరినా తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని దాడి వెనక్కు తగ్గారు. తాను పార్టీలో ఉండి అందరి అభ్యర్థులను గెలిపించుకుని వస్తామని జగన్ కు హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే దాడి వీరభద్రరావు, రత్నాకర్ లు అనకాపల్లి పార్లమెంటు స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు నియోజకవర్గాల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారు. దీంతో దాడికి జగన్ ఏదో ఒక పదవి ఇస్తారన్న ప్రచారం పార్టీలో విన్పిస్తుంది. దశాబ్దకాలం పాటు పదవులకు దూరంగా ఉన్న దాడి వీరభద్రరావుకు మంచి ఛాన్సు దక్కుతుందన్నది వాస్తవం.

చివరి నిమిషంలో చేరి…..

ఇక కొణతాల రామకృష్ణ చివరి నిమిషం వరకూ ఊగిసలాడి టీడీపీలో చేరిపోయారు. పార్టీలో చేరేందుకు జగన్ వద్దకు వెళ్లిన కొణతాలకు కండువా కప్పే సమయంలో తనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. దీంతో జగన్ కండువా కప్పలేదు. తర్వాత కొణతాల చంద్రబాబువైపు చూశారు. అలాగే సబ్బం హరి కూడా నాలుగున్నరేళ్లు ఏ పార్టీలో చేరకుండా ఖాళీగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడే సమయంలో టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఆయన పార్టీ లో చేరకుండానే భీమిలీ టిక్కెట్ కేటాయించారు. అక్కడ ఓటమి పాలయ్యారు. సబ్బం హరికి స్థానిక టీడీపీనేతలతోనూ సత్సంబంధాలు లేవు. దీంతో కొణతాల, సబ్బం హరి లు మరో ఐదేళ్ల పాటు పదవులకోసం ఆగాల్సిందే. దాడి మాత్రం వీరిని దాటుకుని వెళ్లారు.

Ravi Batchali
About Ravi Batchali 32533 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*