డేటా…మ్యాటర్ మహా సీరియస్…!!

కేసీఆర్, చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఐటి గ్రీడ్స్ కంపెనీ కేసు మరో దుమారాన్ని రేపింది. తెరపైకీ మరో వివాదం వచ్చి చేరింది. ఈ కేసులో టిసర్కార్, తెలంగాణ పోలీసు ల వ్యవహరశైలిపై ఫేక్ ట్విట్టర్స్ సోషల్ మిడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ట్విట్లర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఫేక్ ట్విట్లర్లపై టిసర్కార్ సీరియస్ గా ఉంది. తెలుగు రాష్ట్రాల పోలిసుల మధ్య నెలకొన్న వివాదం కాస్త ఫేక్ ట్విట్లర్లు మరింత హీట్ ను పెంచింది.. మరోవైపు ఐటీ గ్రిడ్ సంస్థ అధినేత అశోక్ పై తెలంగాణ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి అశోక్ పారిపోకుండా అన్ని విమానాశ్రాయాలను అలెర్ట్ చేశారు.

అసత్య ప్రచారంతో….

ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విటర్‌లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముంబయి. పూణే, రాజస్డాన్, బెంగుళూరు ఇతర రాష్ట్రాల నుంచి టి సర్కార్ పై సోషల్ మిడియా వేదికగా ట్విట్లర్ల ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఐటి శాఖ అదికారులు గమనించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకురావడంతో మాటర్ సీరియస్ అయ్యింది. తప్పుడు ప్రచారం చేస్తున్న అగ్నాత వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ విషయంపై సిసిఎస్ తో పాటు సిఐడి అదికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రభుత్వం సమయత్తమైంది. ఐటి గ్రీడ్స్ కేసు వ్యవహరంలో టి సర్కార్ అనుసరిస్తున్న విధానంపై ట్విట్టర్ లో కొంతమంది దుష్ప్రచారం చేసినట్లు ట్విట్లర్ లు చక్కర్లు కొట్టాయి. దీంతో తెలంగాణ పోలిసులు చట్టపరమైన చర్యలకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వివాదం ముదిరి…..

ఇప్పటికే ఐటి గ్రీడ్స్ డేటా చోరి పై జంట కమిషనరేట్ల పరిదిలో మూడు పోలిస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా వివాదంగా మారిన ట్విట్లర్ల వ్వవహారంపై ప్రభుత్వం సిసిఎస్ కు ఫిర్యాదు చేస్తే హైదరాబాద్ లో మరోకేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం తరుపునుండి ఐటి శాఖ అదికారులు ఫిర్యాదు చేస్తే మాత్రం తెలంగాణ పోలిసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సోషల్ మిడియా వేదికగా ట్విట్లర్లలో టి సర్కార్ పై హిందీ భాషలో దుష్ప్రచారం సాగినట్లు పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. పూర్తి ఆధారాలను ఐటి శాఖ అదికారులు సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఆధారాలు సేకరించిన అనంతరం పోలిసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

రెచ్చగొట్టేందుకు….

తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడంతో పాటు, భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు అజ్ఞాత వ్యక్తులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ గుర్తించింది. ఇదే అంశాన్ని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. క్యాష్ ఫర్ ట్వీట్ అనే హ్యాష్‌ ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమం ట్వీట్‌ల ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ఏపి అధికార పార్టీ ఆదేశాల మేరకు ఎదురుదాడి జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ల వెనుక చంద్రబాబు, లోకేశ్‌ హస్తమున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

తెలంగాణను ముద్దాయిని చేేసేందుకు…..

ఆంధ్ర, తెలంగాణలతో సంబంధంలేని ట్విట్టర్‌ అకౌంట్ల నుంచి వేల సంఖ్యలో డేటా చౌర్యం కేసుకు సంబంధించి అనేక ట్వీట్లు వచ్చాయి. అయితే ఈ ట్వీట్ల సారాంశం అంతా తెలంగాణ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపేలా ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి కూడా తెలుగు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేయడం టీఆర్‌ఎస్‌ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఈ కేసులో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సైబరాబాద్ పోలిస్ కమిషనర్ సజ్జన్నార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఫేక్ ట్విట్టర్ల విషయంలో టిసర్కార్ సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఐడి గ్రీడ్స్ కంపెనీపై వివిధ పోలిస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.. ఇక ఫేక్ ట్విట్లరపై తెలంగాణ ప్రభుత్వం పోలిసులకు ఫిర్యాదు చేస్తే గనుక ఈ వ్యవహరంలో మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు స్టేట్లలో వార్ ను పుట్టిస్తున్న ఐటి గ్రీడ్స్ వ్యవహారం భవిష్యత్ లో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 18771 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*