తుముకూరు… సులువుగా లేదే…!!

devegouda-janathadal-s-thumukuru-constiuency

పెద్దాయన మనవళ్ల కోసం రాంగ్ రూట్ వెతుక్కున్నారా? ఇప్పటి వరకూ అపజయం లేని ఆయనకు ఇప్పుడు కఠిన పరీక్ష ఎదురవుతోందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. దేవెగౌడ కుటుంబం టార్గెట్ గా భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ లోని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా దేవెగౌడ కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు బరిలోకి దిగడంతో పార్టీలతో పాటు ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత కన్పిస్తుందంటున్నారు.

ఈ వయసులోనూ…..

మాజీ ప్రధాని దేవెగౌడకు తొంభయి పదుల వయసు దాటింది. ఈ వయసులో ఆయనకు మనవళ్లను రాజకీయ నేతలుగా చూడాలని కోరిక కలిగింది. దీంతో రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ ను హాసన్ నుంచి, కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడను మాండ్య నుంచి పోటీకి దింపారు. తాను జీవించి ఉండగానే వారి రాజీకీయ అరంగేట్రంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నది ఆయన కోరిక. అందుకే తనకు పట్టున్న హాసన్ ను ప్రజ్వల్ కు వదిలేసి తాను తుముకూరు నుంచి పోటీ చేస్తున్నారు.

చెమటలు పడుతున్నాయి…..

అయితే హాసన్ ను పక్కన పెడితే…. మాండ్య, తుముకూరు నియోజకవర్గాలు దేవెగౌడకు చెమటలు పట్టిస్తున్నాయి. తుముకూరులో దేవెగౌడ గెలుపు అంత ఈజీకాదన్నది విశ్లేషకుల అంచనా. తుముకూరులో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ముద్ద హనుమగౌడకు టిక్కెట్ నిరాకరించి దేవెగౌడ పార్టీకి ఇవ్వడంతో ఆయన వర్గం అసమ్మతితో రగిలిపోతుంది. హనుమగౌడను బుజ్జగించినా ఆయన వర్గం మాత్రం ససేమిరా అంటోంది. ఇక్కడ కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ క్యాడర్ లు కలసి పనిచేసే పరిస్థితులు కన్పించడం లేదు.

అంత ఈజీ కాదని….

ఇది దేవెగౌడను కలవరపర్చే అంశమే. అయితే ఈయనకు అండగా ఇక్కడ వక్కలిగలు పెద్ద సంఖ్యలో ఉండటం కొంత కలసి వచ్చే అంశమే అయినా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బసవరాజ బలమున్న నేత కావడం గమనార్హం. తుముకూరు నుంచి నాలుగు సార్లు గెలిచిన బసవరాజ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ముద్దహనుమగౌడ చేతిలో 74 వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. మరి పెద్దాయన కదా? ఒక ఛాన్సిద్దామని అనుకుంటారా? లేక స్థానికంగా అందుబాటులో ఉండే బసవరాజకు మద్దతు పలుకుతారా? అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద దేవెగౌడకు తుముకూరు స్థానం చెమటలు పట్టిస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 21610 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*