స్టాలిన్ లో టెన్షన్ ..టెన్షన్….!!

dmk-stallin-rajanikanth-in-tamilnadu

రజనీకాంత్ ప్రకటన ఆయన అభిమానుల్లో కొంత నిరాశ..కొంత ఉత్తేజం నింపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని రజనీకాంత్ ఇటీవల పోలింగ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన డీఎంకే నేతల్లో కొంత నిరాశను కల్పించిందనే చెప్పాలి. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత కొంత రాష్ట్రంలో డీఎంకేకే సానుకూలంగా రాజకీయ పరిణామాలున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ డీఎంకేకు అధిక స్థానాలు వచ్చే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. ముందస్తు సర్వేలు కూడా ఇవే చెప్పాయి.

రజనీ ప్రకటనతో…..

అయితే రజనీకాంత్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికి ఇబ్బంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. 2021లో గాని అసెంబ్లీ ఎన్నికలు రావు. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటే స్టాలిన్ సీఎం పీఠాన్ని అధిష్టించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఆ అవకాశమొచ్చినా రజనీ కాంత్ పార్టీ రాజకీయంగా క్షేత్రస్థాయిలో బలోపేతం కాకముందే ఎన్నికల వెళ్లాలన్న ఆలోచన కూడా డీఎంకే అధినేత చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజనీ ప్రకటన తర్వాత దీనిపై స్టాలిన్ సీనియర్ నేతలతో చర్చించారని చెబుతున్నారు.

అన్నాడీఎంకే కంటే….

తమిళనాడులో అధికారంలో అన్నాడీఎంకే కు నాయకత్వం లేదు. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని నడపించలేరన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు కూటమితోనే మళ్లీ ముందుకు వెళ్లే అవకాశముంది. అలాగే టీటీవీ దినకరన్, శశికళలు కూడా కొన్ని ప్రాంతాలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపలేరన్నది వాస్తవం. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కూడా పెద్దగా ఫలితాలు రాబట్టలేదన్నది విశ్లేషకుల అంచనా. ఈ సమయంలో రజనీ పార్టీయే ముందుంటుంది. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందనేది వాస్తవం. దీనిని రజనీ ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతారని కూడా అంచనాలు ఉన్నాయి.

పదేళ్లు అధికారానికి దూరంగా….

రజనీకాంత్ ఏ పార్టీతో పొత్తు లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది. ఇప్పటికే రజనీకాంత్ రాష్ట్ర వ్యావ్తంగా సభ్యత్వ నమోదును దాదాపు గా పూర్తి చేశారు. ఆయన వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో పాలిటిక్స్ పై దృష్టి పెడతారంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీ ఎఫెక్ట్ డీఎంకేపైనే ఎక్కువగా పడే అవకాశముంది. ఇప్పటికే పదేళ్ల నుంచి అధికారం లేని డీఎంకే రజనీ రాకతో మరోసారి అధికారం కోల్పోతే పార్టీ మనుగడ కష్టమవుతుంది. అందుకే తమిళనాడులో జరిగిన 22 అసెంబ్లీ స్థానాల్లోగెలిచి స్లాలిన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడమా? లేక రజనీ పార్టీ బలోపేతం కాకముందే ప్రజల తీర్పు కోసం మరోసారి ఎన్నికలకు వెళ్లడమా? అన్నది డీఎంకేలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 18134 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*