గొట్టిపాటిది అంతా బ్యాడ్ టైమేనా…?

gottipati-ravikumar-telugudesamparty

గొట్టిపాటి రవికుమార్ వరస విజయాలతో దూసుకుపోతున్న ఆయనకు అదృష్టం మాత్రం కలసి రావడం లేదు. అద్దంకి నియోజకవర్గం నుంచి అప్రతిహతంగా విజయం సాధిస్తూ, పార్టీ ఏదైనా తనదే గెలుపు అంటున్న గొట్టిపాటి రవికుమార్ మంత్రి పదవిని మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు ఓపిక పట్టుంటే ఇప్పుడు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కేదన్న ది వాస్తవం.

వైసీపి నుంచి గెలిచి….

2014 ఎన్నికలలో గొట్టి పాటి రవికుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. అప్పట్లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. 2009లో తొలిసారి ఆయన అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయన జూనియర్ లీడర్ కావడంతో మంత్రి పదవి దక్కలేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచినా ఆ పార్టీ పవర్ లోకి రాలేకపోయింది.

టీడీపీలో చేరినా….

అయితే వైసీపీ నుంచి గెలిచిన గొట్టి పాటి రవికుమార్ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అధికార పార్టీలో చేరి కొంతమేర అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేసినప్పటికీ మంత్రి పదవి మాత్రం రాలేదు. వైసీీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబునాయుడు సామాజిక సమీకరణల దృష్ట్యా గొట్టిపాటికి కేబినెట్ లో చోటు కల్పించలేకపోయారు. తన చిరకాల ప్రత్యర్థి కరణం బలరాంకు, తనకు సంధికుదర్చడమే ఆయన మంత్రి పదవి కంటే గొప్ప అని చెబుతున్నారు.

ఇప్పుడు చేరదామనుకున్నా….

గొట్టిపాటి రవికుమార్ మరో మూడేళ్ల పాటు వైసీపీలో కొనసాగి ఉంటే ఖచ్చితంగా ఈ సారి జగన్ మంత్రి వర్గంలో చోటు దక్కేదంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న గొట్టిపాటికి మంత్రి పదవి మాత్రం అందనంత దూరమయింది. ఈసారి వైసీపీలో చేరాలకున్నా జగన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. గొట్టిపాటి రవికుమార్ మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుంది.

Ravi Batchali
About Ravi Batchali 21833 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*