గవర్నర్ దెబ్బకు అది లేనట్లేనా….?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇక విస్తరణ ఇప్పట్లో చంద్రబాబు చేపట్టరని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఇక మంత్రివర్గ విస్తరణ దాదాపుగా లేనట్లేనన్నది టీడీపీ వర్గాల నుంచి విన్పిస్తున్న సమాచారం. వాస్తవానికి గత నెలలోనే మంత్రి వర్గ విస్తరణచేపట్టాలని చంద్రబాబు భావించారు. అయితే కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమల హత్యతో ఈ విస్తరణ వాయిదా పడింది. అయినావిస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి భావించారు. ఇక ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటంతో కేబినెట్ లోకి మైనారిటీ, ఎస్టీ సామాజిక వర్గాలను తీసుకోవాలని చంద్రబాబు భావించారు.

మంత్రివర్గ విస్తరణ చేపట్టి…..

మైనారిటీ నుంచి ఎమ్మెల్సీ షరీఫ్, ఎన్.ఎం.డి. ఫరూక్ పేర్లను పరిశీలించారు. అలాగే కిడారి సర్వేశ్వరరావు కుమారుడిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లుకూడా వార్తలు వచ్చాయి.అయితే జగన్ పై హత్యాయత్నం కేసు రావడంతో ఒక్కసారిగా ఏపీలో సీన్ మారిపోయింది. జగన్ పై హత్యాకేసు విషయాన్ని పక్కన పెడితే గవర్నర్ నరసింహన్ తో చంద్రబాబు ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వచ్చారు. జగన్ పై దాడి జరిగిన వెంటనే గవర్నర్ నరసింహన్ డీజీపీకి ఫోన్ చేయడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఒక్కాసారిగా తొలిసారి గవర్నర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. గవర్నర్ కు ఏం అధికారాలున్నాయని డీజీపీకి ఫోన్ చేశారంటూ ఢిల్లీలోనూ ప్రశ్నించారు. గవర్నర్ కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని టీడీపీమంత్రులు కూడా ఫైరయ్యారు.

గవర్నర్ తో విభేదాల నేపథ్యంలో…..

ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలంటే గవర్నర్ అమరావతి రాక తప్పనిసరి. గవర్నర్ తో మాట్లాడేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు. అక్కడ కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించినట్లు తమతో ఉండటం లేదన్నది టీడీపీ వర్గాల ఆరోపణ. అలాగే గవర్నర్ ఏపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ మంత్రులు ఘాటైన విమర్శలుచేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు మొగ్గు చూపరన్నది టీడీపీ ఇన్ సైడ్ వర్గాల్లో విన్పిస్తున్న టాక్. ఇక నరసింహన్ ను అమరావతికి చంద్రబాబు పిలవరని, అందుకే మంత్రివర్గ విస్తరణ చేపట్టరన్నది కొందరు సీనియర్ నేతలు సయితం తమ అంతర్గత సంభాషణల్లో పేర్కొంటుండటం గమనార్హం.

Ravi Batchali
About Ravi Batchali 39132 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*