ఒక సీటు.. ఇద్దరు కృష్ణులు….!!

hotseat-chirala-constiuency

చీరాల నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే హాట్ సీట్ గా మారింది. ఇక్కడ సీనియర్ నేత కరణం బలరామ‘‘కృష్ణ’’మూర్తి పోటీ చేయడమే ఇందుకు కారణం. కరణం బలరాం చీరాలలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసంతృప్త నేతలందరినీ కలుపుకుని ముందుకు వెళుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నేత ఆమంచి ‘‘కృష్ణ’’మోహన్ బరిలో ఉన్నారు. ఇద్దరికీ ఏ ఒక్కరూ తీసిపోరు. ఇద్దరూ మాస్ ఇమేజ్ ఉన్న నాయకులే కావడం గమనార్హం. కరణం బలరామకృష్ణ మూర్తి జిల్లా స్థాయి నేతకాగా, ఆమంచి కృష్ణమోహన్ లోకల్ గా పట్టున్న లీడర్.

అనేక మంది పోటీ పడినా….

తెలుగుదేశం పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ బయటకు వచ్చి వైసీపీలో చేరిన తర్వాత చీరాల తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు మరింత ఎక్కువవుతాయనుకున్నారు.సీటుకోసం సిగపట్లు తప్పవని భావించారు.ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావులు టిక్కెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే అద్దంకి సీటుపై కన్నేసిన కరణం బలరాంను తెలివిగా చంద్రబాబు చీరాల నియోజకవర్గానికి పంపి అక్కడ గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టడమే కాకుండా, అద్దంకిలో కూడా గొట్టిపాటి రవికుమార్ కు అడ్డం లేకుండా చేశారు.

అందరూ ఏకమై….

ఇప్పుడు కరణం బలరాం దృష్టంతా చీరాలనియోజకవర్గంపైనే ఉంది. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ సయితం చీరాలనియోజకవర్గంలోనే మకాం వేసి తండ్రి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రచార బాధ్యతలన్నింటినీ కరణం వెంకటేష్ భుజానకెత్తుకున్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే పాలేటిరామరావు, వైసీపీలో టిక్కెట్ ఆశించి భంగపడి టీడీపీలో చేరిన మరో నేత యడం బాలాజీలు ఎవరికి వారే కరణానికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తమ సామాజిక వర్గాల్లో ఓట్లు సంపాదించేందుకు చెమటోడుస్తున్నారు.

ఆమంచి స్థానికతతో….

ఇక వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ను తక్కువగా అంచనా వేయలేం. ఆయన గత ఎన్నికల్లో నవోదయ పార్టీ పెట్టి ఘన విజయం సాధించారు. రెండుసార్లు చీరాల ఎమ్మెల్యేగా గెలిచారు. తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాను స్థానికుడని అంటూ ఆమంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా సరికొత్త నినాదంతో ఆమంచి ప్రజల్లోకి వెళుతున్నారు. దీంతో చీరాలలో ఫైట్ నువ్వా? నేనా? అన్నట్లు తయారైంది. ఇద్దరు అభ్యర్థుల్లో ప్లస్, మైనస్ లు ఉన్నాయి. ఎవరు గెలిచినా అతి స్వల్ప మెజారిటీతోనేన్నది విశ్లేషకుల అంచనా. అందుకే ఈసారి ప్రకాశం జిల్లాలో చీరాల సీటు హీటు సీటయ్యింది.

Ravi Batchali
About Ravi Batchali 30069 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*