ఆఖరి ఘడియల్లో…చేతులెత్తేస్తారా….???

indian-national-congress-in-rajasthan

రాజస్థాన్ లో హస్తం పార్టీకి విజయం చిక్కినట్లే చిక్కి చేజారుతుందా? పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో పాటుఆధిపత్య పోరు ఆ పార్టీకి చేటు తెస్తుందా? అవును.. రాజస్థాన్ ఎన్నికలు దగ్గరపడే సమయంలో కాంగ్రెస్ డీలా పడిందంటున్నారు. ఇదంతా చేజేతులా చేసుకుందేనన్నది పార్టీ వర్గాలు సయితం అంగీకరిస్తున్న విషయం. రాజస్థాన్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందునుంచి కాంగ్రెస్ కే విజయావకాశాలు కన్పించాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో కొంత అనుమానాలున్నా రాజస్థాన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎటువంటి అనుమానాలు లేవు. కమలం పార్టీ కూడా రాజస్థాన్ ను ఒకదశలో వదులుకున్నట్లే కన్పించింది.

కాంగ్రెస్ లో లుకలుకలు….

ఈ నెల 7వ తేదీన రాజస్థాన్ లో ఎన్నికలు జరగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఆరు రోజులు సమయం ఉండగానే కాంగ్రెస్ క్రమేపీ పట్టుకోల్పోతుందన్న వార్తలు వస్తున్నాయి. మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో ఈసారి కాంగ్రెస్ 140 నుంచి 160 వరకూ స్థానాలు చేజిక్కించుకుంటామన్న ధీమాగా ఉంది. అయితే క్రమేపీ ధీమా కన్పించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవవడం, అశోక్ గెహ్లెట్, సచిన్ పైలట్ లు ఇద్దరూ పోటీకి దిగడంతో కాంగ్రెస్ క్యాడర్ లోనే అయోమయం నెలకొంది. దీంతో పాటు సోషల్ మీడియాలో సయితం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక ముస్లిం పండగలో పాల్గొన్న అశోక్ గెహ్లెట్ అక్కడ ఆకుపచ్చ జెండాలు ఉండటంతో పాకిస్థాన్ జెండాలుగా జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై గెహ్లాట్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

కమలం దూకుడుకు….

మరోవైపు కమలం పార్టీ దూకూడు పెంచింది. వసుంధర రాజే పై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. మోదీ రాజస్థాన్ లో ఎనమిది సభల్లో పాల్గొననున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాజస్థాన్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. నిన్న మొన్నటి వరకూ వసుంధరపై ఆగ్రహంతో ఉన్న ఆర్ఎస్ఎస్ ను కూడా శాంతింపచేశారు. వారు కూడా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. దీంతో కమలం పార్టీ కొంత పుంజుకున్నట్లయింది. అయోధ్య అంశాన్ని ఆర్ఎస్ఎస్ గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ లో పోటీ చేస్తున్న రెబెల్స్ వల్ల కూడా తమకు లాభం చేకూరుతుందని కమలం పార్టీ భావిస్తోంది.

నష్టనివారణ చర్యలకు…..

ఇక కాంగ్రెస్ కూడా నష్టనివారణ చర్యలకు దిగింది. తెలంగాణలో మాదిరిగానే అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్లు రంగంలోకి దిగారు. అహ్మద్ పటేల్ వంటి నేతలు రాజస్థాన్ లోని పార్టీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. నేతల మధ్య సయోధ్యకు గట్టిగానే చర్యలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ బాధ్యతలను అహ్మద్ పటేల్ కు పార్టీ అధిష్టానం పూర్తిగా అప్పగించింది. సచిన్ పైలట్, అశోక గెహ్లాట్ ల వర్గాల మధ్య సయోధ్య కుదిరితేనే ఈ ఎన్నికల్లో విజయం సాధ్యమని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 35928 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*