
ఐటీ గ్రిడ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది.. సంస్థ నిర్వహాకుడు అశోక్ చిక్కితే కేసులో పూర్తి క్లారిటీ రానుంది. నోటీసు జారీ చేసిన అశోక్ పోలీసుల ముందు విచారణకు హాజరు కాకాపోవడంతో అరెస్టుకు రంగం సిధ్దం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే 91 సీఆర్పీసీ కింద అమెజాన్ , గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ కు నోటీసులు జారి చేశారు సైబరాబాద్ పోలీసులు. క్లౌడ్స్ స్టోరేజ్ లోనే డేటా సేప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. అశోక్ తన సెక్యూరిటీ కీస్ ద్వారానే సదరు డేటాను ఒపెన్ చేయాల్సి ఉంటుంది.
గాలింపు చర్యలు….
డేటా కేసులో సైబరాబాద్ టెక్నికల్ వింగ్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు .సంస్థ నిర్వహాకుడు అశోక్ కోసం సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పోలీసులు టీమ్ ల వారిగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు అశోక్ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. సైబరాబా పోలీసులు మొదట 160 సీర్పీసీ నోటీస్ జారీ చేశారు. సదరు నోటీసు గడువు పూర్తి అయ్యింది. ఐనప్పటికీ అశోక్ అచూకీ మిస్టరీగా మారింది. విలువైన డేటా అశోక్ దగ్గరే ఉందని పోలీసులు బావిస్తునారు. దీంతో విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులకు జారీ చేశారు అధికారులు.
ముందస్తు ప్రణాళికలో భాగంగానే….
మదాపూర్ లోని అయ్యప్పసోసైటీ లోని ఐటీ గ్రిడ్స్ ప్రధాన కార్యలయంలో రైడ్స్ సమయంలో లభ్యం అయిన డేటాను నిపుణులతో విశ్లేషణ చేస్తున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ అధికారులు గత కొత్త రోజుల నుంచి దశల వారిగా డేటాను సేకరిస్తున్నారు. ఇప్పటికే సేవా మిత్ర యాప్ ద్వారా నే ఏపీ స్టేట్ ప్రజల వ్యక్తిగత డేటా సేకరించినట్లు ప్రాథమిక అధారాలు గుర్తించారు. ఎస్సాఆర్ నగర్ , మదాపూర్ పోలీస్ స్టేషన్లలో ఐటీ గ్రిడ్స్ కంపనీపై ఫిర్యాదులు అందాయి. కేసు నమోదు చేసుకున్న రెండు కమిషనరేట్ల పోలీసులు వారి వారి స్టేట్ మెంట్ల ను రికార్డు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నట్లు ఏపీ స్టేట్ నంచి వచ్చిన ఓటర్, ఆధార్ డేటా సర్కార్ లబ్బి దారుల సమచారాం అంతా ఐటీ గ్రిడ్స్ సేకరిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మొత్తం ఎంత డేటాను ఎక్కడా నుంచి సేకరించారు? సహకరిచింది ఎవరు ? అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు సంస్థ సీఈవో అశోక్ పోలీసుల ముందు హాజరవుతేనే కేసు కొల్లిక్కి రానుంది. అశోక్ ముందస్తు ప్రణాలికలో భాగంగానే అమెజాన్ , గూగుల్ క్లౌడ్ స్పేస్ ను కొనుగోలు చేసి ఆయా సంస్థల తో అగ్రిమెంట్ పెట్టుకున్నట్లు గుర్తించారు దర్యాప్తు అధికారులు. ఇక అగ్రిమెంట్టో భాగంగా అమెజాన్ కానీ, గూగుల్ కానీ వాటి నిబంధనల ప్రకారం సదరు డేటాను క్లయింట్ అనుమతి లేకుండా డిస్ క్లోజ్ చేయడం కష్టం అంటున్నారు నిపుణులు.
క్లయింట్ అనుమతి లేకుండా…..
అశోక్ మాత్రమే సదరు డేటాను ఎక్కడి నుంచి అయిన తీసుకునే విధంగా వ్యక్తి గత వివరాలు పాస్ వర్డ్ యూజర్ ఐడీ తో యాక్సెస్ చేయడం వీలు పడుతుంది. ఇక ఉద్దేశ పుర్వకంగా సదరు డేటానంతా అన్ రీడబుల్ ఫార్మేట్ లోకి సైతం మారి పోయే ఆస్కారం ఉందనే వాదన తెరమీదకు వస్తోంది. అశోక్ పరారీలో ఉన్న కారణంగా ఇప్పటికే డేటానంతా ఎన్ క్రిప్ట్ చేశాడా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఎన్ క్రిప్షన్ చేసిన డేటా అశోక్ మాత్రమే యాక్సిస్ చేసే ఛాన్స్ ఉంది. కేసు పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే… అశోక్ పోలీసులకు చిక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతను అందుబాటులోకి రాకపోతే.. కేసు సూదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది . మరో వైపు ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులు గుర్తించింది.. డేటా మాత్రమే ఐటీ గ్రిడ్స్ సేకరించింది అనే అంశం.. మరి ఆధార్ డేటా నా? మరే ఇతరా డేటానా? ఓట్ల తొలగింపు జరిగే ప్రక్రియా ?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అశోక్ పైనే దృష్టి సారించారు సైబరాబాద్ , హైదరాబాద్ కమీషనరేట్ పోలీసులు.
Leave a Reply