జగన్ నేడు ఏం తేల్చనున్నారు?

కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ నేడు మరో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేతలతో జగన్ ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలు, పార్లమెంటు సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి కలవనున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిసింది. వైసీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేసిన తర్వాత ఆమరణ దీక్ష చేసి ఆసుపత్రిలో చికిత్ప పొంది నిన్న రాష్ట్ర పతి రామ్ నాధ్ కోవింద్ ను కలిశారు.

ఎంపీలు, సీనియర్ నేతలతో…..

రామ్ నాధ్ కోవింద్ కు రాష్ట్రంలో జరగుతున్న పరిస్థితులను ఎంపీలు వివరించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వడం లేదని వారు ఫిర్యాదు చేశారు. తమ రాజీనామాలకు దారితీసిన పరిస్థితులను కూడా వారు వివరించారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం వారు నేరుగా ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరి వచ్చారు. జగన్ తో సమావేశమైన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఎంపీలు చెబుతున్నారు. తమ రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదని, వాటి ఆమోదం కోసం కూడా తాము ముమ్మరంగా ప్రయత్నించనున్నట్లు చెప్పారు.

మరోసారి స్పీకర్ ను కలిసి…..

పార్లమెంటు సభ్యులు రాజీనామాలు ఆమోదం కాకపోవడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. రాజీనామాలు డ్రామాలుగా మిగిలిపోకుండా ఉండాలంటే, వాటిని ఆమోదించుకుని ఎన్నికలకు వెళ్లడమే మేలన్నది వారి ఆలోచనగా ఉంది. జగన్ తో భేటీ అయిన తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లి స్పీకర్ ను మరోసారి కలవాలని ఎంపీలు భావిస్తున్నారు. అవసరమైతే మరోసారి స్పీకర్ ఫార్మాట్ లో కూడా రాజీనామాలు సమర్పించాలని కూడా నిర్ణయించుకున్నారు. మరి జగన్ సమావేశంలో తీసుకునే నిర్ణయంపైనే తమ కార్యాచరణ ఉంటుందని వారు చెబుతున్నారు.

ఎమ్మెల్యేల రాజీనామాలపై కూడా….

ఇదే సమావేశంలో ఎమ్మెల్యేల రాజీనామాలపై కూడా జగన్ సీనియర్ నేతలతో చర్చించే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి వచ్చేసింది. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ముందడుగు వేయకుంటే ఎలా? అని ఎమ్మెల్యేలు కూడా అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పడు ఎమ్మెల్యేలుగా ఉండి కూడా అధికార పార్టీ తీరుతో నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నామని, అలా ఉండే కంటే రాజీనామా చేసి తిరిగి ప్రజల వద్దకు వెళ్లడమే మేలని అత్యధికమంది ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని జగన్ కు ఇప్పటికే తెలిపారు. దీంతో ఎమ్మెల్యేల రాజీనామా విషయంపై కూడా జగన్ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Ravi Batchali
About Ravi Batchali 29064 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*