జగన్ అందుకే టార్గెట్ చేస్తున్నారా …?

వైసిపి అధినేత జగన్ రూట్ మార్చారు. టిడిపి తో సమానంగా జనసేన ను టార్గెట్ చేయడం ఆరంభించారు. ఇదే ప్లాన్ ఇప్పుడు అధికార టిడిపి అనుసరిస్తుంది. ఒక పక్క వైసిపి మరోపక్క బిజెపి ఇంకోపక్క జనసేనలను లక్ష్యం చేసుకుంటూ తామే ఏపీ ప్రయోజనాలకోసం ఛాంపియన్ గా పోరాటం చేస్తున్నామనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. టిడిపి వ్యూహాన్ని పసిగట్టిన వైసిపి అదే స్కెచ్ ప్రత్యర్థి పార్టీలపై ప్రయోగించడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే తాజాగా జగన్ జనసేన అధినేతపై నిప్పులు చెరగడానికి కారణం అంటున్నారు విశ్లేషకులు. హోదా విభజన హామీలు అమలు చేయాలని తొలినుంచి డిమాండ్ చేయడం తోపాటు రాష్ట్ర విభజనను పూర్తిగా వ్యతిరేకించిన పార్టీ వైసిపి అన్నది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆ పార్టీ అధినేత భావిస్తున్నట్లు జగన్ తాజా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.

పికె పై వైసిపి విమర్శల దాడి తగ్గింది …

వాస్తవానికి పవన్ కళ్యాణ్ గుంటూరు సభ తరువాత వైసిపి జనసేనను టార్గెట్ చేయడం మానుకుంది. తెలుగుదేశం, బిజెపి , జనసేన నడుమ జరిగిన మాటల యుద్హాన్ని బాగా అస్వాదించింది. కానీ ఈ వ్యూహం భవిష్యత్తులో దెబ్బకొడుతుందని పార్టీ వ్యూహకర్తలు ఇచ్చిన డైరెక్షన్ తో జగన్ ఇక యాక్షన్ లోకి దిగారు. నేరుగా పవన్ పై విమర్శల వర్షాన్ని తానే కురిపించడం మొదలు పెట్టారు. బాబు అధికారానికి జనసేన కారణం కాదా ? ఆ మూడు పార్టీలే రాష్ట్రాన్ని ముంచాయంటూ టిడిపి, బిజెపి , జనసేనలపై జగన్ విరుచుకుపడ్డారు. ఇకపై టిడిపి తో సమానంగా అవకాశం దొరికినప్పుడాల్లా జనసేనను ఉతకాలన్న సందేశాన్ని పార్టీ శ్రేణులకు అన్యోపదేశంగా జగన్ పంపించారు. అలాగే నిత్యం ప్రజల్లో ఉండేది తానేనని సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ అంటూ ఎద్దేవా చేస్తూ జనసేన కు రాబోయే ఎన్నికల్లో పోటీలో ప్రాధాన్యత లేదనే అంశాన్ని చెబుతూనే ఆ పార్టీని రెచ్చగొట్టారు.

కమ్యూనిస్టులతో కలిసి రోడ్డెక్కాక …

పార్టీ నిర్మాణం పూర్తిగా లేని జనసేనకు నిర్మాణాత్మక సైన్యం లేదు. ఆ కొరతను కమ్యూనిస్ట్ లను కలుపుకుని వెళ్ళి పార్టీ నిర్మాణం పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. అంతేకాకుండా వీధి ఉద్యమాలకు తెరతీశారు. దాంతో వైసిపి మొగ్గలోనే జనసేనకు చెక్ పెట్టే వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఎపి రాజకీయాల్లో బలమైన కాపు సామాజిక వర్గం అండగా వున్న పవన్ పార్టీని ఉపేక్షిస్తే ఆపార్టీ నానాటికి బలోపేతం అయి ఎన్నికల రణరంగంలో గట్టి దెబ్బలే కొట్టే అవకాశాలు ఉన్నాయని వైసిపి భావిస్తుంది. అందుకే ముందే మేల్కొని టిడిపి తో బాటు అడుగడుగునా జనసేనను ప్రశ్నలు వేసి విసిగించి ఆ పార్టీ క్రెడిబిలిటీ నిలదీయాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 33887 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*