
వైఎస్ జగన్ విజయవాడలో అడుగుపెట్టారో లేదో రాజకీయాలు వేడెక్కిపోయాయి. వస్తూ వస్తూనే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన గౌతమ్ రెడ్డి ని తిరిగి అక్కున చేర్చుకున్నారు. దాంతో బెజవాడ పార్టీ రాజకీయాల్లో అగ్గి తిరిగి రాజేసినట్లు అయ్యింది. కొద్ది కాలం క్రితం వంగవీటి మోహన రంగాపై గౌతమ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ కి గురయ్యారు. ఆ వ్యాఖ్యలపై రంగ తనయుడు రాధా తీవ్రంగా ప్రతిస్పందించారు. ఉంటే తాను అయినా ఉండాలి లేదా గౌతమ్ రెడ్డి అయినా ఉండాలన్న రేంజ్ లో పోరాడిన సంగతి తెలిసిందే.
రాధా బయటకు వచ్చేస్తారా …?
ఇప్పుడు గౌతమ్ రెడ్డి రీ ఎంట్రీ సాఫీగా సాగిపోయింది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాధా వైసిపిని వదిలేయొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఆయనకు జనసేన తప్ప ఏ పార్టీ లో ఛాన్స్ వుండే అవకాశాలు తక్కువ. పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఏ ఒక్కరికి స్పష్టమైన టికెట్ హామీ లభించలేదు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా అడుగులు ఎటువైపు అనే చర్చ మొదలైపోయింది రాబోయే ఎన్నికల్లో విజయ లక్ష్మి కోసం రోజుకో పంధాలో సాగుతున్నారు. చూద్దాం ఎలా ఎవరి నిర్ణయాలు సక్సెస్ అవుతాయో…?
Leave a Reply