
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టామని, అయితే జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు అర్థమవుతుందని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. జగన్ ఎందుకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారో ఇప్పుడు తమకు తెలిసొచ్చిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తప్పులను ప్రస్తావించిన వెంటనే మైక్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుందన్నారు. అందుకే జగన్ ఇక అసెంబ్లీకి వచ్చి వృధా అని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తనకు అనిపిస్తుందన్నారు.
Leave a Reply