
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఏ నేతకు టికెట్ ఫట్ మంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితిని ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడ పోటీ చేసి విజయం సాధించారు డేవిడ్ రాజు. అయితే, ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో ఆయన వైసీపీకి బై చెప్పి.. సైకిల్ ఎక్కారు. అయితే, ఈయన స్థానిక టీడీపీలో ఆశించిన మేరకు దూసుకు పోలేక పోయారనే విషయం అధినేతకు చేరింది. డేవిడ్‌రాజుపై ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ పాత నేతలు సీఎం ఎదుటే పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగారు. దీంతో వచ్చే ఎన్నికల్లో డేవిడ్ రాజును తప్పించి కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారని సమాచారం.
ఐఏఎస్ అధికారిని….
ఇక, డేవిడ్ రాజును తప్పిస్తే.. ఎవరికి టికెట్ ఇస్తారు? అనే ప్రశ్న వెంటనే తెరమీదికి వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఐఏఎస్ అధికారి దేవానంద్‌తో పాటు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన అజితారావు ఇటీవల సీఎంను కలిసి తనకు సీటు ఇవ్వాలంటూ కోరినట్లు తెలుస్తోంది. అజితారావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండడంతో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం నిర్ణయించారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ మాగుంట సూచించిన అభ్యర్థికే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఐఏఎస్ దేవానంద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో డేవిడ్ రాజుకు దాదాపు యర్రగొండ పాలెం టికెట్‌ను ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టంగా తెలుస్తోంది.
ఎస్.ఎన్ పాడు ఇస్తారా?
అయితే, పార్టీ మారే సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు డేవిడ్ రాజుకు ఎక్కడో ఒకచోట టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో సంతనూతలపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజును రాబోయే ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని వారంతా ప్రణాళిక ప్రకారం సిద్ధంగా ఉన్నారు. ఇందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సహా మరి కొందరు నేతలు మద్ధతు పలుకుతున్నట్టు టాక్.
విజయ్ కుమార్ కు ఇస్తే….
సంతనూతలపాడు నుంచి డేవిడ్‌రాజును పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంతనూతలపాడు మినహా తాను ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ తేల్చి చెబుతున్నారు. బీఎన్ అభ్యర్థిత్వాన్ని సీఎం తిరస్కరిస్తారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక వేళ బీఎస్కే బాబు మద్దతు తెలిపితే.. డేవిడ్ రాజుకు దేవుడే గతి! అంటున్నారు. వాస్తవానికి వైసీపీలో యర్రగొండపాలెంలో బలమైన లీడర్‌గా ఉన్న డేవిడ్‌రాజు ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడే ఆయన అక్కడ అన్ని విధాలా వీక్ అయిపోయారు. ఇప్పుడు టీడీపీ సీటు డైట్ అయితే వైసీపీ నుంచి ప్రస్తుత సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేష్ ఇక్కడ పోటీకి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఆయన చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో డేవిడ్‌రాజు వేసినరాంగ్ స్టెప్‌తో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు రాకపోతే ఆయన పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టే అన్న చర్చలు కూడా జిల్లాలో నడుస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply