సింధియా సెల్ఫ్ గోల్ వేసేశారా….!!!

jyothiradithya-sindhia-uttarpradesh

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ సెల్ప్ గోల్ వేసుకుందా? అతిపెద్ద రాష్ట్రంలో ఓటమి తప్పదని ముందుగానే తెలిసిపోయిందా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరిగింది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఏం చేయాలి? అభ్యర్థుల్లో గెలుస్తామన్న మనో ధైర్యాన్ని నింపాలి. ఓటర్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేస్ట్ కాదని చెప్పాలి. కానీ అలా కాకుండా ఎన్నికల తర్వాత బీఎస్పీ, ఎస్పీతో పొత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ఎస్పీ, బీఎస్పీలు…..

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 లోక్ సభ స్థానాలున్నాయి. ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లు కలిసి పోట ీ చేస్తున్నారు. ఒక్క అమేధీ, రాయబరేలీ స్థానాలు తప్పించి అన్ని స్థానాల్లో బీఎస్పీ, ఎస్పీ, రాష్ట్రీయ జనతాదళ్ లు బరిలోకి దిగాయి. ఈ మూడు పార్టీల కూటమికి ఇక్కడ ఎక్కువ స్థానాలు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. నలభై నుంచి యాభై స్థానాల్లో ఈకూటమికి విజయావకాశాలున్నట్లు సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి.

ఒంటరిగా పోటీ చేసినా….

కాంగ్రెస్ పార్టీని బీఎస్పీ, ఎస్పీ దూరంగా పెట్టడంతో ఉత్తరప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. బీఎస్సీ, ఎస్పీ ప్రధాన నేతలు పోటీ చేసే ఏడు నియోజకవర్గాలు తప్పించి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దించింది. కొన్నిచోట్ల త్రిముఖ పోటీ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ బీఎస్పీ, ఎస్పీ ఓటు బ్యాంకుకు గండి కొడుతుందన్న అంచనాలు విన్పిస్తున్నాయి. ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలను యూపీ బాధ్యులుగా పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.

పొత్తు ప్రకటనపై…..

ప్రియాంక గత కొద్దిరోజులుగా ‍యూపీలోనే మకాం వేసి పార్టీకి జవసత్వాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతా ఓకే అనుకున్న సమయంలో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ సీన్ మార్చేశారు. ఎన్నికల అనంతరం బీఎస్పీ, ఎస్పీతో పొత్తు ఉంటుందని ప్రకటించడం సెల్ఫ్ గోల్ వేసుకోవడమేనని, ఈ వ్యాఖ్యలు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తాయంటున్నారు విశ్లేషకులు. పొత్తు ఉంటుందని ముందుగానే ప్రకటించడంతో ఓటర్లు కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గు చూపుతారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద యూపీలో జ్యోతిరాదిత్య సింధియా సీన్ మొత్తం మార్చేసినట్లే. గత ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ కు ఎదురయ్యే అవకాశముంది.

Ravi Batchali
About Ravi Batchali 30229 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*