టిక్కెట్ ఎంత పనిచేసింది?

వచ్చేనెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి జరపతలపెట్టిన ప్రగతి నివేదన సభ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షగా మారింది. జనసమీకరణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు సమీకరణలో పైచేయి సాధించాలని తపన పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు. ఈ నెల 2న కొంగరకలాన్ లో ప్రగతి నివేదన సభ జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభకు 25 లక్షల మంది వస్తారని ఆయన బయటకు చెప్పేశారు. దీంతో టీఆర్ఎస్ నేతల్లో కంగారు మొదలయింది.

సాధ్యమేనా?

ఇంతమంది జనసమీకరణ సాధ్యమేనా? అన్న ప్రశ్న వారిలోనే తలెత్తుతోంది. దీంతో పాటు సెప్టంబరులోనే అభ్యర్థులను ప్రకటిస్తానని కేసీఆర్ ప్రకటించారు. సభలోనే ఒక జాబితాను కేసీఆర్ విడుదల చేస్తారా? అన్న అనుమానం బయలుదేరింది. ఈ కారణంతో నియోజకవర్గాల్లో సీటు కోసం పోటీ పడే అభ్యర్థులు జనసమీకరణలో తలమునకలై ఉన్నారు. సెప్టంబరు 2న తమ వాహనంలో ఎక్కాలని ముందుగానే ప్రజలను బుక్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇరవై వేల నుంచి ఇరవే అయిదువేల మంది తరలించాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఆచరణలో ఇది సాధ్యం కాదని, వ్యవసాయ పనులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొందరు నిర్మొహమాటంగా తాము రాలేమని చెప్పేస్తుండటంతో నేతలు నిరాశ పడుతున్నారు.

బుక్ అయిపోతున్న వాహనాలు…..

ఇప్పటికే కొందరు నేతలు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రయివేటు కళాశాలల బస్సులను కూడా ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు. తమ నియోజకవర్గ పరిధిలోనే కాకుండా పక్క నియోజకవర్గంలో వాహనాలేమైనా ఉన్నాయా? అంటూ అనుచరులను పంపి మరీ ఆరా తీస్తున్నారు. వీటితో పాటు ప్రయివేటు ట్రాక్టర్లను కూడా తీసుకురావాలని నిర్ణయించారు. కొందరు ఎమ్మెల్యేలయితే రైతుల వద్ద ఉన్న ట్రాక్టర్లను తమకు అద్దెకు ఇవ్వాలని, డీజిల్ కొట్టించి అద్దె కూడా చెల్లిస్తామని చెబుతున్నా కొందరు అంగీకరించడం లేదు. దీంతో కొందరు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా వాహనాలను సభకోసం తెప్పిస్తున్నారు. టిక్కెట్లను వచ్చే నెలలోనే ప్రకటిస్తామని చెప్పడంతో గులాబీ పార్టీ నేతల్లో సభ హైరానా మొదలయింది.

Ravi Batchali
About Ravi Batchali 39148 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*