‘‘కేసు’’ స్టడీలో కేసీఆర్….!

పాత కేసులను తిరగదోడి ప్ర‌తి ప‌క్ష నాయ‌కుల‌కు బేంబేలేత్తిస్తున్నారు అదికార పార్టీ నేత‌లు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత‌ల‌పై పాత కేసులు ఊపందుకున్నాయి. రెవంత్ రెడ్డి , గండ్ర వెంక‌ట ర‌మ‌ణ రెడ్డి , తూర్పు జ‌గ్గ రెడ్డి…ఇలా కేసులు ఏవైనా విప‌క్షాల‌ను కేసుల‌తో టార్గేట్ చేస్తూ డిఫేన్స్ లో ప‌డేస్తోంది అధికార పార్టీ . ఇక నియోజ‌క వ‌ర్గ స్థాయిలోను త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న ఇత‌ర పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు త‌మ కార్యక‌ర్త‌ల‌తో బ‌నాయిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ఇక పక్క రాష్ట్రం ముఖ్య మంత్రికి సైతం పాత కేసుల భ‌యం ప‌ట్టుకుంది.

పాత కేసులతో…….

స‌ర్జిక‌ల్ స్ట్రైక్ తో ముంద‌స్తుకు రెడీ అయిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అదే ఉపుతో విప‌క్షాల‌కు చెక్ పెట్టేందుకు అస్త్ర‌ాల‌ను సిద్దం చేస్తోంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ వారిపై ఉన్న పాత కేసుల‌ను బ‌య‌ట‌కుతీస్తున్నారు. అరెస్టుల‌తో అపోజిష‌న్ ను కోలుకోకుండా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగా త‌మ‌కు ప్ర‌తి ప‌క్షంగా ఉన్న పార్టీల నేత‌ల‌ను పాత కేసుల‌తో భయ‌పేడుతున్నారు. ఇందుకు గ‌తంలో ఉన్న కేసుల వ్య‌వ‌హ‌రానికి సంబందించి లేదా తాజాగా ఉన్న కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప‌లువురు కీల‌క నేత‌లకు సంబందించిన ప‌లు కేసుల‌ హిస్ట‌రీని స్ట‌డీ చేస్తున్నారు.

వరుసకేసులతో…….

తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షంగా ఉన్న కాంగ్రెప్ పార్టీని పూర్తిగా కోలుకోలేని విధంగా చేయాల‌న్న‌ది అదికార పార్టీ ఆలోచ‌న గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.దానికి తోడు గ‌తంలోను ఉన్న ప‌లు కేసుల వ్య‌వ‌హ‌రంలో అప్ప‌టి నేత‌లు ఉండటం తో అది ఇప్పుడు రూలింగ్ పార్టీకి అస్త్రంగా మారింది.రేవంత్ రెడ్డి టిడిపి లో ఉన్న‌ప్పుడు ఓటుకు నోటు కేసులో దోరికినా అది పూర్తిగా అధికార పార్టీనే త‌మ‌ను ఇరికించింద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. కాగ వ‌రంగ‌ల్ జిల్లాకు చేందిన మ‌రో కాంగ్రెస్ నేత గండ్ర వెంక‌ట ర‌మ‌ణ రెడ్డి ఓ మ‌హిళ ను మోసం చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇలా ఏదో ఓక కేసులో కాంగ్రెస్ నేత‌లే ఉండ‌టం తో ప్ర‌తి ప‌క్ష పార్టీలో ఉన్న నాయ‌కుల‌కు చెక్ పేట్టేందుకే ఈ అరెస్టు చేయిస్తున్న‌ర‌ని ఆరోపిస్తున్నారు. ఇక మ‌రో కాంగ్రెస్ పార్టీ మాజీ శాస‌న స‌భ్యులు తూర్పు జ‌య ప్ర‌కాశ్ రెడ్డిని మ‌నుషుల అక్ర‌మ రవాణా పేరుతో అరెస్టు చేశారు. పూర్తి ఆధార‌ల‌తోనే జ‌గ్గ‌రెడ్డి అరెస్టు చేశామ‌ని పోలీసులు చేప్తున్నా అది రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగ‌మేన‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. జ‌గ్గారెడ్డిపై అరెస్ట్ అస్త్రం ప్ర‌యోగించ‌డంతో మిగ‌త నాయ‌కుల్లో గుబులు మొద‌లైంది.

త్వరలోనే కేసులు బయటకు…….

ఇక కాంగ్రెస్ పార్టీ హ‌యంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేత‌లు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ట్టు టీఆర్ఎస్ నేత‌లు విప‌క్షాల‌పై అరోణ‌లు గుప్పిస్తున్నారు.ఇక వీటింన్నిటిపై త్వ‌ర‌లోనే చ‌ర్య‌లు ఉంటాయిని అధికార పార్టీ నేత‌లే బాహాటంగానే విమ‌ర్శ‌లు చేస్తున్న త‌రుణంలో మ‌రింత వేడి ర‌గులుతుంది. ఇందిర‌మ్మ హౌసింగ్ స్కాం, జుబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ, ప‌లు ల్యాండ్ క‌బ్జాల‌కు సంబందించిన కేసులు పెండింగ్ లో ఉండ‌టంతో వాటి ద‌ర్యాప్తును తిరిగి వేగ‌వంతం చేయ‌నున్నారు.ఇప్ప‌టికే మాన‌వ అక్ర‌మ రవాణా కేసులో జ‌గ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…తాజాగా జుబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ ప‌రిణామాల‌తో మిగ‌తా కేసులు ఉన్న నేత‌ల్లో గుబులు పుట్టుకుంది. త్వ‌ర‌లో సీఐడీ ద‌ర్యాప్తు చేస్తున్న‌ ఇందిర‌మ్మ హౌసింగ్ స్కాంలోను క‌ద‌లికలు ఉండే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. అప్ప‌ట్లో గృహ‌నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పేరు ఈ స్కాంలో ప్ర‌ముఖంగా వినిపించింది. దీంతో ఈ కేసును మ‌రోసారి తిర‌గ‌దొడేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.విటిపై ప్ర‌తి ప‌క్ష‌ల నేత‌లు ఘ‌టుగా నే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అదికారాన్ని అడ్డుపేట్టుకోని టి ఆర్ ఎస్ నాయ‌కులు చేస్తున్న అక్ర‌మ అరెస్టు ల‌కు భయ‌ప‌డ‌మ‌ని చెప్తున్నారు.

పొన్నాల నుంచి శ్రీధర్ బాబు వరకూ….

ఇక వ‌రంగ‌ల్ లో అసైన్ మెంట్ ల్యాండ్ స్కాంలో పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, మెయినాబాద్, రాజేంద్ర‌న‌గ‌ర్ లో జ‌రిగిన ల్యాండ్ క‌బ్జాల్లో మాజీ హోంమంత్రి స‌బిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, ల్యాండ్ గ్రాబింగ్ కేసుల్లో ప్రేమ‌సాగ‌ర్ రావు, కొండా ముర‌ళి, క్ర‌ష‌ర్ యాజ‌మానిని తుపాకితో బెద‌రించిన కేసులో గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి, మైనింగ్ కేసులో డికే అరుణ‌, గంజాయి కేసులో శ్రీధ‌ర్ బాబు, అలాగే ఇత‌ర కేసుల్లో ఇన్వాల్వ్ అయిన నేత‌ల కేసు హిస్ట‌రీల‌ను ప‌రిశిలిస్తుండ‌టం తో ఓక్క‌సారిగా ఉత్కంఠ నెల‌కోంది.

ఓటుకు నోటు కేసు కూడా……

మరోవైపు పక్క రాష్ట్ర ముఖ్య మంత్రికి సైతం పాత కేసుల భ‌యం ప‌ట్టుకుంది. బాబ్లీ ప్రాజెక్టు ను అడ్డుకున్న‌ార‌న్న కొణంలో చంద్ర‌బాడు నాయుడుతో పాటు అప్పుడు ఉన్న కొంతమంది టిడిపి నేత‌ల‌కు మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేయ‌డం తీవ్ర దుమారం రేపింది. కేవ‌లం ఏపి ప్ర‌భుత్వం కేంద్ర‌ానికి వ్య‌తిరేకంగా మాట్ల‌ాడుతోంద‌న్న కార‌ణంగా చంద్ర‌బాబు నాయుడు పై రాజ‌కీయ క‌క్ష్య సాధింపుకు పాల్ప‌డుతుంద‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అప్పుడు ప్ర‌జల క్షేమం దృష్ట్యా బాబ్లీ ప్రాజేక్టు ను అడ్డుకుంటే మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వం తో కుమ‌క్కై త‌మ‌ను బెదిరిస్తున్న‌ార‌ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు.ఇక నియోజ‌క వ‌ర్గాల్లోను కేసులతో ప్ర‌తి ప‌క్ష‌ నేతలను కుదేలు చేస్తున్నారు ఆయా నియోజ‌క వ‌ర్గాల ఎమ్మేల్యే లు . ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది ప్రత్యర్థులను బ‌ల‌హీన ప‌ర్చేందుకు అదికార పార్టీ నేత‌లు కుట్ర‌లు చేస్తున్న‌ార‌ని ఆరోపిస్తున్నారు.రాజ‌కీయంగా త‌మ‌ను ఎదుర్కొనలేక త‌మ‌పైన త‌మ కార్య‌క‌ర్త‌ల‌తో త‌ప్పుడు కేసులు పేట్టిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజ‌క వ‌ర్గంలో టి ఆర్ ఎస్ పార్టికి చేందిన ర‌మేష్ నాయ‌క్ అనే కార్య‌క‌ర్త స్థానిక శాస‌న స‌భ్యులు వివేకానాంద ప్రోద్బలంతో త‌మ‌పై త‌ప్పుడు కేసులు పేట్టించి అట్ర‌ాసిటి కేసులో ఇరికించ‌ార‌ని మాజీ ఏమ్యేల్యే కూన శ్రీశైలం గౌడ్ , అత‌ని త‌మ్ముడు శ్రీనివాస్ గౌడ్ లు ఆరోపిస్తున్నారు. అధికార‌పార్టీ మొద‌లు పెట్టిన కేసుల ప‌రంప‌ర‌తో విప‌క్ష‌ నేతల్లోదడ మొద‌లైంది. ఈ అంశ‌ల‌న్నింటినీ వాడుకుని ప్ర‌తి ప‌క్ష‌ాల‌ను డిఫెన్స్ లో కి నేట్టేయాల‌నే ఆలొచ‌న‌లో టి ఆర్ ఎస్ అధిష్టానం ఉన్న‌ట్లు ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 40561 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*