కరణం వేగానికి ఇక కళ్లెం వేయలేరా?

సీనియర్ నేత కరణం బలరాం దూకుడు పెంచారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయినట్లే కన్పిస్తోంది. గత పది రోజులుగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే అద్దంకి రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. కరణం బలరాం వర్సెస్ గొట్టి పాటి రవికుమార్ వార్ మళ్లీ ప్రారంభమయ్యేటట్లే కన్పిస్తోంది. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం పేరు తెలియని వారుండరు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరడంతో వివాదం ప్రారంభమయింది.

టిక్కెట్ దక్కకపోయినా…..

కరణం, గొట్టిపాటి కుటుంబాలకు పాత కక్షలున్నాయి. ఎన్నోసార్లు రెండు వర్గాలు హత్యలకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో ఒకే పార్టీలో ఇద్దరు నేతలు ఉండటం కష్టమన్నది అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో ఓటమి పాలయిన కరణం బలరాం తనయుడు వెంకటేశ్ కు ఈసారి టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్న సందేహం కరణం ఫ్యామిలీలో వెంటాడుతుంది. అద్దంకి నియోజకవర్గాన్ని గతంలో వెంకటేశ్ ఇన్ ఛార్జిగా వ్యవహరించారు. అయితే గొట్టిపాటి చేరిన తర్వాత అద్దంకి బాధ్యతల నుంచి కరణం ఫ్యామిలీని పూర్తిగా చంద్రబాబు తప్పించేశారు.

వేగం పెంచిన కరణం…..

దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్న కరణం బలరాం మళ్లీ అద్దంకిలో తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గత పది రోజుల నుంచి కరణం దూకుడు పెంచారంటున్నారు. అద్దంకిలో వరుసగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు కరణం హాజరవుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని జె.పంగులూరు, బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో సిమెంట్స్ రోడ్లకు కరణం శంకుస్థాపనలు చేస్తుండటం చర్చనీయాంశమయింది. ఈ మండలాల్లో సర్పంచ్ లు సయితం కరణం వెంటే నడుస్తున్నారు.

మళ్లీ రచ్చరచ్చేనా?

శంకుస్థాపనకు వచ్చిన సమయంలో వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుంచి కరణం వెంకటేశ్ పోటీ చేయనున్నారని ఆయన తన వర్గం నేతలతో చెబుతుండటం విశేషం. అంటే కరణం అమితుమీ తేల్చుకునేందుకే సిద్ధమయ్యారన్న టాక్ అద్దంకి నియోజకవర్గంలో విన్పిస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో తన పట్టును కోల్పోకుండా ఉండేందుకే పది రోజుల నుంచి కరణం ప్రత్యేక దృష్టి పెట్టారంటున్నారు. దీనిపై ఇప్పటికే గొట్టిపాటి రవికుమార్ పార్టీ , చంద్రబాబు దృష్టికి ఈవిషయాలను తీసుకెళ్లనప్పటికీ ఫలితం లేదు. దీంతో కరణం మరింత వేగం పెంచారంటున్నారు. రానున్న రోజుల్లో అద్దంకి రాజకీయాలు హాట్ హాట్ గా మారే అవకాశముంది.

Ravi Batchali
About Ravi Batchali 21833 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*