
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అంటారు! ఇక, రాజకీయాల్లోనూ ఇదే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. రాజకీయాల్లోనూ ఎప్పుడు ఎలాంటి సవాళ్లు వస్తాయో? ఎప్పుడు ఎలాంటి చమక్కులు వినిపిస్తాయో? చెప్పడం కష్టం. ఇప్పుడు ఇలాంటి వాతావరణమే తెలంగాణా రాజకీయాల్లోనూ కనిపిస్తోంది. ప్రొఫెసర్గా వృత్తిని ప్రారంభించిన కోదండరాం.. తర్వాత తర్వాత.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అదేసయమంలో రాజకీయాల్లోకి రావాలన్న ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. అయితే, తనతో కలిసిమెలిసి తిరిగిన తెలంగాణా ప్రస్తుత సీఎం కేసీఆర్ నుంచే ఆయన తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడం లేదంటూ విమర్శలు గుప్పించడంతో టీఆర్ఎస్ సర్కారుకు ఆయనకు మధ్య తీవ్ర వివాదాలు రేగాయి. కేసీఆర్ ఏకంగా “వాడు-వీడు“ అనే వరకు వ్యవహారం నడిచింది.
రాష్ట్ర సాధనలో కీలక పాత్ర…..
తెలంగాణ సాధనలో ప్రత్యేక పాత్ర పోషించిన సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, వంటా వార్పు, సకల జనుల సమ్మె, సాగర హారం, చలో హైదరాబాద్ వంటి రాజకీయ మీటింగ్లు విజయవంతం అయ్యయంటే అది టీజేఏసీ పోషించిన పాత్ర వలనే అని చెప్పాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, వెనువెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగిపోయాయి. అయితే తాము అనుకున్నట్టుగా బంగారు తెలంగాణ రాలేదని, ఆంధ్ర పాలకులు తెలంగాణకు ద్రోహం చేసిన మాదిరిగానే కేసీఆర్ కూడా చేస్తున్నారని విమర్శించారు. ఇక, ఇదే రేంజ్లో ఆయనపైనా ఎదురు దాడి జరిగింది. ‘వార్డు మెంబర్గా కూడా గెలవనోడు’ అంటూ ఏకంగా సీఎం కేసీఆరే విమర్శలు చేశారు. మొత్తానికి ఉద్యమ పంథా నుంచి రాజ కీయ రంగ ప్రవేశం చేసి.. ‘తెలంగాణ జన సమితి’తో ప్రజల ముందుకు వస్తున్నారు.
ప్రజాకూటమిలో భాగస్వామిగా….
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలతో కలిసి ప్రజాకూటమిలో భాగస్వాములయ్యా రు. టీఆర్ఎస్ సర్కారును గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, ఉద్యమకారులు కోదండరాంకు మద్ధతుగా ఉండటం గమనార్హం. ఈ మద్ధతును టీజేఎస్ ఓట్లుగా మలుచుకోగలదా..? కాంగ్రెస్ను గెలిపించి ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందా.? టీఆర్ఎస్ గెలుపునకు పరోక్షంగా కారణ మవుతుందా.? అనేది వచ్చే ఎన్నికల్లో తేలిపోనుంది. కాగా, ప్రజాకూటమిలో భాగం గా వచ్చే ఎన్నికల్లో ఆయన మంచిర్యాల నుంచి పోటీ చేస్తా రని తెలుస్తోంది. విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం తీవ్రస్థాయిలో ఉద్యమించిన కోదండరాం.. భవిత ఏంటి? ఆయన గెలుస్తారా? కేసీఆర్ దూకుడుకు ఆయన పగ్గాలు వేయగలరా? లేక కేసీఆర్ గెలిచి మరోసారి తన సత్తాచూపుతారా? అనేది ప్రధాన అంశంగా మారిపోయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply