ఈయన చేతుల్లో ఏమీ లేదటగా…!!

konathala ramkirshna telugudesamparty

విశాఖ జిల్లా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ ఆధిపత్యం కోసం టీడీపీ, వైసీపీ గట్టిగానే పోరాడుతున్నాయి. కాంగ్రెస్ లో ఉన్న నేతలకు గేలం వేస్తున్న టీడీపీ ఏ పార్టీలో లేని మాజీలను కూడా కలుపుకుంటోంది. తమ పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావుని వైసీపీలోకి తీసుకున్న జగన్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేలా మిగిలిన నేతలను సైకిలెక్కించాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణను టీడీపీ గూటికి తీసుకువస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కొణతాలను మరో వైపు వైసీపీ నేతలు కూడా సంప్రదిస్తున్నారు. ఏకంగా జగన్ సన్నిహితుడు, ఎంపీ విజయసాయిరెడ్డి రమ్మని ఆహ్వానిస్తున్నారు. అయితే ఆయన వియ్యంకుడు, అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీలోనే ఉన్నందున కొణతాల ఇటు వైపుగా ఉన్నారని అంటున్నారు. ఇక నోటిఫికేషన్ వచ్చేలోగా తన నిర్ణయం చెబుతానని కొణతాల రెండు పార్టీల నేతలకు హామీ ఇచ్చారని టాక్ నడుతోంది.

ఎమ్మెల్యేగానేనా…?

నిజానికి కొణతాలకు ఈసారి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుంది. మరో సారి మంత్రిగా చక్రం తిప్పాలని కూడా ఉంది. అయితే టీడీపీలో మాత్రం ఆయన వియ్యకుడే సిట్టింగ్ ఎమ్మెల్యే, పీలా గోవింద సత్యనారాయణ ఆ పార్టీ నుంచి మరో మారు పోటీకి రెడీ అంటున్నారు. అయితే ఆయనకు అధినాయత్వం టికెట్ ఇస్తుందో లేదో డౌట్లో ఉంది. ఇక అదే సీటుకు చాలా మంది టీడీపీ నేతలు ట్రై చేస్తున్నారు. దాంతో కొణతాలను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయిస్తారని అంటున్నారు. మరో వైపు వైసీపీలో మాత్రం కొణతాల వస్తే ఆయనకు ఎంపీ, ఎమ్మెల్యే ఏదైనా ఇస్తామని ఓపేన్ ఆఫర్ ఉంది. కానీ వియ్యంకుడి వత్తిడి వల్ల కొణతాల ఆగిపోయారని అంటున్నారు. వియ్యకుడు పీలా టికెట్ వ్యవహారం తేలితేనే తప్ప కొణతాల‌ కధ ముందుకు సాగదని అంటున్నారు.

అలా జరుగుతుందా..?

ఇక కొణతాలను వైసీపీ కూడా గట్టిగా కోరుతూండడంతో టీడీపీ ఆయన కోరుకుంటున్న అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడానికి చివరి నిముషంలో సిధ్ధపడవచ్చునన్న ప్రచారమూ సాగుతోంది. అదే జరిగితే ఏకంగా వియ్యంకుడిగే పొగ పెట్టి కొణతాల పార్టీలోకి రావాలి. అదే జరిగితే కొణతాల అందుకు ఒప్పుకుంటారా. పైగా వియ్యకుండు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు.ఇక ఇక్కడో ప్రచారం కూడా వినిపిస్తోంది. టికెట్ రాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా సైతం పార్టీని ఫిరాయిస్తారని, అపుడు వైసీపీలోకే వియ్యంకులు ఇద్దరూ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలా అయితే కొణతాల ఎమ్మెల్యేగా, పీలా ఎంపీగా పోటీకి రెడీ అవుతారని టాక్ నడుతోంది. ఇదంతా టీడీపీ, వైసీపీ అధినేతల ఎత్తులు పై ఎత్తుల మీద ఆధారపడి ఉన్నందున కొణతాల రాజకీయం ఇప్పటికైతే ఆయన చేతుల్లో లేదనే అంటున్నారు. ఏది ఏమైనా రూరల్ జిల్లాలో పట్టు కోసం రెండు పార్టీలు వ్యూహాలు పన్నుతూండడంతో విశాఖ రాజకీయం వేడెక్కుతోంది.

Ravi Batchali
About Ravi Batchali 34027 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*