కొత్తపల్లి దెబ్బకు తారుమారవుతుందా?

kothapally-subbarayudu-ysrcongress-party

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న మరో నియోజకవర్గం నరసాపురం అసెంబ్లీ స్థానం. టీడీపీ ఆవిర్భావం నుంచి ఒక్క 2009 మినహా మిగతా అన్నీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీనే విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ తెదేపానే విజయం సాధించింది. తెదేపా నుంచి పోటీ చేసిన బండారు మాధవనాయుడు..అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి సుబ్బరాయుడుపై 21వేల తేడాతో గెలిచారు. ఇక ఎన్నికల్లో కూడా మళ్ళీ బండారు మాధవనాయుడు బరిలో ఉన్నారు. అయితే 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరిన కొత్తపల్లి కూడా ఈ టికెట్ కోసం ట్రై చేశారు కానీ చంద్రబాబు మాత్రం బండారు వైపే మొగ్గు చూపారు. దీంతో కొత్తపల్లి మళ్ళీ తెదేపాని వీడి వైసీపీలో చేరిపోయారు.

గతం కంటే బలంగా….

కొత్తపల్లి పార్టీని వీడిన ప్రభావం కొంతవరకు బండారుపై పడనుంది. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసేన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మళ్ళీ గెలిపిస్తాయని బండారు ధీమాగా ఉన్నారు. ఇక్కడ తెదేపా కేడర్ కూడా బలంగా ఉంది. అయితే వైకాపా బలంగా ఉండటం…జనసేన పోటీ చేయటం తెదేపాకి మైనస్ కానున్నాయి. జ‌న‌సేన నుంచి బీసీ వ‌ర్గానికి చెందిన బొమ్మిడి నాయ‌క‌ర్ రేసులో ఉండ‌డంతో కాపుల ఓట్ల‌తో పాటు బీసీల ఓట్లు కొంత వ‌ర‌కు చీలే ఛాన్స్ ఉంది. అటు వైసీపీ నుంచి సీనియర్ నేత ముదునూరి ప్రసాదరాజు బరిలో ఉన్నారు. 2009లో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం.. నియోజకవర్గంలో మంచి పట్టుంది. గతంలో కంటే వైకాపా ఇక్కడ బలంగా ఉంది. గత ఎన్నికల్లో సీటు ఇవ్వలేదన్న సానుభూతి…కొత్తపల్లి సుబ్బరాయుడు వైకాపాలోకి రావడం ప్లస్. ఇక ఇక్కడ జనసేన పోటీ ఉండటం వలన వైకాపాకి కొంత నష్టం కలగొచ్చు.

హోరా హోరీ…..

ఈ నియోజకవర్గ పరిధిలో కాపు ఓటర్లు ఎక్కువ ఉండటం..పార్లమెంట్ బరిలో నాగబాబు ఉండటం జనసేనకి కలిసిరావొచ్చు. మెగా ఫ్యామిలీ స్వగ్రామం ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని మొగ‌ల్తూరు. దీంతో ఇక్కడ మెగా అభిమానులు భారీగానే ఉన్నారు. జ‌న‌సేన విజ‌యం ఎలా ఉన్నా భారీగా ఓట్లు చీలిస్తే ఆ ప్రభావం తేదేపా, వైకాపా గెలుపు ఓట‌ముల‌పై ప‌డుతుంది. ఈ నియోజకవర్గంలో కాపులు, క్షత్రియ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత బీసీ, ఎస్సీల ఉన్నారు. ఎక్కువ శాతం కాపు ఓటర్లే గెలుపుని డిసైడ్ చేయనున్నారు. క్షత్రియులు ఆర్ధికంగా బలంగా ఉండటం వలన అభ్యర్ధుల గెలుపుని వీరు ప్రభావితం చేయగలరు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ తెదేపా-వైకాపాల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం. కానీ జనసేన వలన ఓట్లు చీలి గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉంది. జనసేన ప్రభావం వలన ఏ పార్టీ నష్టపోతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 18020 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*