
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి… రాజీకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ లోనే గడిపి….అనేక పదవులు అనుభవించి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రి గా కూడాపనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న సూర్య ప్రకాశ్ రెడ్డి ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన తొలుతు కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేయాలని భావించారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస తో పొత్తు ఉంటుందని, హస్తం గుర్తుమీదే పోటీ చేయాలనితొలుత భావించారు.
ఇద్దరూ ఒకటయితే….
అయితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు లేకపోవడంతో అవగాహన మేరకు ఆయన టీడీపీలో చేరిపోయారు. ఆయన కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయగా, కోట్ల సతీమణి సుజాతమ్మ ఆలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అప్పటి వరకూ బద్ధ శత్రువులుగా ఉన్న కోట్ల కుటుంబం, కేఈ కుంటుంబాలను చంద్రబాబు నాయుడు ఒక్కటి చేయగలిగారు. ఫ్యాక్షనిజాన్ని అంతమొందించడమే తన ధ్యేయమని, అందుకే ప్రత్యర్థులను ఏకం చేస్తున్నాననిచంద్రబాబు తన రాష్ట్ర వ్యాప్త ప్రచార సభల్లో చెప్పుకొచ్చారు.
వైసీపీలోకి వెళ్లకుండా….
కానీ కోట్ల, కేఈకుటుంబాల కలయిక ఆపార్టీకి ఏ మాత్రం ప్లస్ కాలేదనే ఫలితాలను చూస్తే తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తొలుత వైసీపీలోకి వెళ్లాలనుకున్నారు. అక్కడ ఎంపీగా ఉన్న బుట్టారేణుక టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీలోకి వెళ్లడం మంచిదనుకున్నారు. జగన్ పార్టీ నుంచి కూడా ఆహ్వానం అందింది. అయితే చంద్రబాబునాయుడు ఖచ్చితంగాగెలిచేది టీడీపీయేనని,పార్టీలో చేరాలని ఆహ్వానించడంతో కోట్ల మనసు మార్చుకుని టీడీపీలో చేరారు. కోట్ల సూర్యప్రకాశరెడ్డికి పోటీగా జగన్ బీసీ అభ్యర్థి సంజీవ్ కుమార్ ను నిలబెట్టడంతో తేలిపోతాడనుకున్నారంతా. కానీ లక్షకు పైగా మెజారిటీతో సంజీవ్ కుమార్ గెలిచారు.
సుజాతమ్మ కూడా….
కోట్ల సుజాతమ్మ కూడా ఆలూరు నియోజకవర్గం లో దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కర్నూలు జిల్లాలో బీసీల ప్రాబల్యం ఎక్కువ. దీంతో బీసీలంతా వైసీపీ వైపు మొగ్గు చూపారు. గుప్పిట తెరిస్తే ఏమవుతుందోనన్న సామెత కోట్ల విషయంలో రుజువయింది. కోట్ల కు ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందని, ఆయన బలమైన నేత అని ఇన్నాళ్లూ చెప్పుకున్నా… అది చరిత్రగానే మిగలనుంది. పార్లమెంటులోకి అడుగుపెట్టాలన్న కోట్ల ఆశలు అడుగంటాయి. ఒకరకంగా తండ్రి ఆశయాలను,సిద్ధాంతాలను వీడి టీడీపీలో చేరిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబానికి ఈ ఎన్నిక చేదు అనుభవం మిగిల్చింది.
Leave a Reply