ఎందుకంత అసహనం….??

kumaraswamyjanathadals

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలో ఇంత అసహనం ఎందుకు? ఆయన ముఖ్యమంత్రిగా కంఫర్ట్ గా లేరా? ఏ సమస్య ఆయనను ఇలా మాట్లాడిస్తుంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఐదింటిలో నాలుగు స్థానాలను సంకీర్ణ ప్రభుత్వం గెలుచుకున్నా ఆయనలో ఎందుకో తెలయని భయం కన్పిస్తుందా? పాలనలో ఇంకా పట్టు దొరకలేదా? కాంగ్రెస్ నేతల పై కోపం ఆయన సామాన్యులపై చూపుతున్నారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు కర్ణాటకలో చర్చనీయాంశమయ్యాయి.

అంతా సజావుగానే ఉన్నా…..

నిజానికి కుమారస్వామికి ఇప్పట్లో వచ్చిన పదవీ గండం ఏమీ లేదు. ఎందుకంటే లోక్ సభ ఎన్నికలు పూర్తయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే వరకూ కుమారస్వామి సర్కార్ కు ఎటువంట ముప్పులేదు. కాంగ్రెస్ లో కూడా అసమ్మతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో అసమ్మతి స్వరాలు తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో కుమారస్వామి పాలనపై దృష్టి పెట్టాల్సిందిపోయి తరచూ వివాదాల్లోకి చిక్కుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

రైతుల్లో అసంతృప్తి……

ముఖ్యంగా కర్ణాటకలో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. రైతు రుణమాఫీ సక్రమంగా అమలు కాకపోవడం, చెరకు లాంటి పంటలకు గిట్టుబాటు ధరలేకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో తరచూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇది ఎక్కడైనా సహజమే. మహారాష్ట్రలో అయితే ఏకంగా లక్షలాది మంది రైతులు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేసినా ప్రభుత్వం వారి సమస్యలను సానుకూలంగా ఉంది. చర్చలకు ఆహ్వానించింది. కానీ కుమారస్వామి మాత్రం ఒక మహిళారైతుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సంకీర్ణ ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ కూడా డ్యామేజీ అయింది.

క్లాసు పీకిన దళపతి……

కుమారస్వామికి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఓటేసే ముందు తాము గుర్తుకు రాలేదా? అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తమకు ఓట్లు వేయని వారికి డిమాండ్ చేసే హక్కు లేదంటూ నోరు జారారు. తాజాగా మహిళ రైతుపై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జేడీఎస్ అధినేత దేెవెగౌడకు ఫోన్ చేసి మరీ కుమారస్వామికి ఎలా మాట్లాడో చెప్పాలని సూచించాల్సి వచ్చింది. దేవెగౌడ కూడా బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్లలో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని కుమారస్వామికి క్లాస్ పీకాల్సి వచ్చింది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కుతున్న కుమారస్వామిలో అసహనం ఎందుకన్న చర్చ జోరుగా జరుగుతోంది.

Ravi Batchali
About Ravi Batchali 39148 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*