కుమార ను అస్సలు అంగీకరించడం లేదా?

కుమారస్వామి ఏ సమయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టారో గాని కాలం కలసి రావడం లేదు. ఇప్పటి వరకూ మంత్రివర్గ కూర్పు ఒక కొలిక్కి రాకపోవడం, కాంగ్రెస్ పెట్టే షరతులతో సతమతమవుతున్న కుమారస్వామికి తాజాగా రాజరాజేశ్వరి ఎన్నిక షాకిచ్చింది. ఈ ఫలితాన్ని బట్టి కుమారస్వామిని ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించలేదన్నది మరోసారి స్పష్టమయింది. రాజరాజేశ్వరి నగర్ లో జరిగిన ఎన్నికల్లో కుమరస్వామికి చెందిన జనతాదళ్ ఎస్ అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమవ్వడం నైతికంగా ఆయనకు ఎదురుదెబ్బ తగిలిందని భావిస్తున్నారు.

ఈ ఎన్నికలో కూడా……

రాజరాజేశ్వరి నగర్ లో నకిలీ ఓటర్ కార్డులు బయటపడటంతో ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. ఆలస్యంగా ఎన్నికల సంఘం ఈ ఎన్నికను నిర్వహించింది. ఈ ఎన్నిక ఈనెల 28వ తేదీన జరిగింది. అంతకుముందే కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు 78, జనతాదళ్ ఎస్ కు 37, భారతీయ జనతా పార్టీకి 103 స్థానాలు దక్కాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా, కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, అతి తక్కువ స్థానాలను దక్కించుకున్న కుమారస్వామిని ముఖ్యమంత్రి పదవి వరించింది. బీజేపీ విజయపరంపరకు అడ్డుకట్ట వేయాలనే తక్కువ స్థానాలు వచ్చినా కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది.

మూడో స్థానంలో…..

అయితే రాజరాజేశ్వరి నగర్ లో గతంలోనే జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. సంకీర్ణ కూటమి ఏర్పడిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రెండు పార్టీలూ బరిలో నిలిచాయి. ఒక్కరినే బరిలో ఉంచాలని రెండు పార్టీలూ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా మునిరత్న, జనతాదళ్ నుంచి జీహెచ్ రామచంద్ర, బీజేపీ నుంచి తులసీ మునిరాజు గౌడ పోటీ చేశారు. అయతే ఇక్కడ ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థి మధ్యనే జరగడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న తన సమీప బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడపై దాదాపు 41చ162 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ జేడీఎస్ మూడో స్థానంలో నిలిచింది.

తాను చెప్పినట్లుగానే…..

రాజరాజేశ్వరి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని ఒక పక్క ఆనందం ఉన్నా కుమారస్వామి మాత్రం మనసులో తన పార్టీని ప్రజలు ఆదరించలేదని మరోసారి రుజువయిందని బాధపడుతున్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు తాను ప్రజల దీవెనతో ముఖ్యమంత్రిని కాలేదని, కాంగ్రెస్ దీవెనతోనే ముఖ్యమంత్రిని అయ్యానని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. కనీసం ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థి విజయం సాధించి ఉంటే నైతికంగా కుమారస్వామికి మద్దతు లభించేదని భావిస్తున్నారు. మొత్తం మీద కుమారస్వామి అన్నట్లుగానే ప్రజలు దీవెనలు లేవని ఈ ఎన్నిక ఫలితంతో అర్థమైంది. కాంగ్రెస్ దయ ఎంతకాలం ఉంటుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 30873 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*