కన్న పేగు కంటే పరువే ముఖ్యమా?

హేమంత్

ప‌రువు హ‌త్యలు అందోళ‌న క‌లిగిస్తున్నాయి. క‌ర్కశంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. విచ‌క్షణ మ‌రిచి అద్దె రౌడీల‌కు ప‌నిచెబుతున్నారు. ఏ ప‌నైనా స‌రే డ‌బ్బుతో వెల కట్టి ప్రాణాల‌ను హ‌రిస్తున్నారు. స‌మాజాంలో హాన‌ర్ కిల్లింగ్ అనేది కొత్తేమి కాదు. మ‌రి అలాంటి ఊదంతాల‌కు పూర్తి స్థాయిలో అడ్డుక‌ట్ట వేయాలంటే స‌మూల మార్పు అవ‌స‌రం. న్యాయ‌స్థాల జోక్యం ఉన్నా ప‌రువు ముందు అవే తునాతున‌క‌లు అవుతున్నాయి. ధ‌న బ‌లం ప‌లుకుబ‌డితో సోసైటీలో ఘోరాలు నిలువుట్టదంగా నిలుస్తున్నాయి. మ‌రి ఇంకెంత మంది ప‌ర‌వు హ‌త్యల్లో ప్రాణాలు కోల్పోవాలి. అస‌లైన మార్పు ఎలా రావాలి ఇప్పుడిదే. మిలియ‌న్ ప్రశ్నగా స‌భ్యస‌మాజం ముందుంది.

తమకు ఇష్టంలేకపోతే…..

ఇష్టం లేని వివాహాం చేసుకున్నార‌ని తెలిస్తే చాలు.. కుటుంబ పరువు ప్రతిష్ఠల పరిరక్షణ కోసమంటూ హత్యలకు పాల్పడుతున్నారు. నచ్చిన వ్యక్తి’తో అమ్మాయి ఊరు విడిచి పారిపోవడం తమ కుటుంబ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చిందని, ఇష్టపడిన వ్యక్తితో కొన్ని ఏళ్లుగా ప్రేమ వ్యవహారం సాగించడంవల్ల కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, ఆ కళంకాన్ని తుడిచి పెట్టడానికి వారిని చంపుతున్నారు. చంపేయాల్సినంతటి ఘోర నేరాలా అవి? అనే వాద‌న తెర‌మీదికి వ‌చ్చిన ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం స‌దామామూలు. పరువు ప్రతిష్ఠల పేరిట పిల్లల ప్రాణాలను నిలువునా తీయటం ఆ కుటుంబానికి ఏ విధమైన గౌరవం? హంతక కుటుంబంగా మారడం ఆ వంశానికి ఏ రకమైన ప్రతిష్ఠ? ఇలా ఎన్నో ప్రశ్నలు..? ఎవ‌రో ఎదో అనుకుంటారు ఊరిలో ఎలా తలెత్తుకు బ‌త‌కాల‌నే ధోర‌ణితోనే క్షనికావేశంలో సూపారీ గ్యాంగ్ లను ఆశ్రయించి చివ‌రికి క‌ట‌క‌టాల‌పాల‌వడంమే కాకుండా పిల్లల భ‌విష్యత్తు ను చిద్రం చేస్తున్నారు.

కన్నతండ్రులే కాలయముళ్లు……

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే కాల యముళ్ళు అవుతున్నారు. పరువు కోసం పాకులాడుతూ అల్లారు ముద్దుగా పెంచిన తమ పిల్లల జీవితాలను చిద్రం చేస్తున్నారు. ఆర్ధిక అసమానతలు,కులం కార్డుల కుళ్ళుతో పరువు హత్యలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నవరుస ఘటనలతో కన్నప్రేమలు కనిపించకుండా పోతున్నాయా అనే ఆందోళన ప్రతీ మదిలో మెదలతోంది. పరువు…..ఇప్పుడు ఇది సమాజానికి పట్టిన ఓ చీడ పురుగు. కులమతాలనకు అతీతంగా రాకెట్ యుగంలోకి దూసుకెళ్తున్న యువతను కులం అనే అడ్డుగోడులు పరువు హత్యలు చేస్తున్నాయి. ఇందులో ఆర్ధికపరమైన పరువు ఒకటైతే మరోటి కులం కార్డుతో పరువు ప్రాణాలు తీస్తోంది. వీటిలో ప్రేమ పెళ్ళిల్లు ప్రస్తుతం యువతీ యువకుల పాలిట శాపాలుగా మారాయి. కులాంతర వివాహాలు చేసుకున్న యువత జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తున్నారు కొందరు తండ్రులు. ఇందులో తమ హోదాకు భంగం కలుగుతుందనే కన్న వారి కక్ష అమాయక యువతీ యువకుల ప్రాణాలు తీస్తోంది. ఇలాంటివే గత ఏడాది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు పరువు హత్యలు…కన్న ప్రేమనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.

పరువు హత్యతో…..

తాజా గా హైదరాబాద్ లో ఇలాంటి పరువు హత్య సంచలనం రేకెత్తిస్తుంది.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. చందానగర్‌కు చెందిన హేమంత్‌ అతని ఇంటికి సమీపంలో ఉండే అవంతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ వ్యవహారం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో గతేడాది నవంబర్‌ నుంచి ఆమెను ఇంట్లోనే నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్‌ 10వ తేదీన అవంతి ఇంటి నుంచి వచ్చేసి ఇద్దరూ కలిసి బీహెచ్‌ ‌ఈఎల్‌ సంతోషీమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని యువతి తల్లిదండ్రులు, మేనమామలు తీవ్రగా వ్యతిరేకించారు. గతంలో అవంతిక మిస్సింగ్ అయినట్లు తల్లి దండ్రులు కేసు పెట్టారు.. ఆ తరువాత ఇరు కుటుంబాలను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ చేశారు..ఆ సమయంలో కూడా అవంతిక బంధువులు పోలీసులు ముందే దాడి చేసినట్లు అవంతిక తెలిపారు. దీంతో కౌన్సెలింగ్ చేసిన కూడా అవంతి తల్లి దండ్రులకు ఇష్టం లేకపోవడంతో యువజంట గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో నివాసముంటోంది.

కారులో ఎక్కించి…..

ఈ క్రమంలో గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో అవంతి.. బావలు, వదినలు, మామయ్యలు, మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్‌ ఇంటికి వచ్చి ఇద్దరినీ బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి కారులో ఎక్కించారు…. మార్గ మధ్యలో అవంతి కారులోంచి దూకేసి వారి నుండి తప్పించుకుంది…ఇక నలుగురు వ్యక్తులు హేమంత్‌ను కొట్టుకుంటూ కారులోనే తీసుకెళ్లారు. ఈవిషయాన్ని హేమంత్‌ ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు లైవ్ లొకేషన్ సెండ్ చేశాడు. ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారు కిడ్నాపర్లు. అవంతిక వెంటనే డైలీ 100 కి కాల్ చేసి నా భర్త ను మా మేనామాలు కిడ్నాప్ చేసి తీసుకుళుతున్నారు అంటూ చెప్పడం తో వెంటనే గచ్చి బౌలి పోలుసులు ను అలర్ట్ చేశారు.. అప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్లిన వాహనాలు ఆచూకీ దొరకలేదు.. హేమంత్ ను కొంత దూరం వెళ్ళగానే మరో వాహనం లో ఎక్కించి కారులోనే చిత్రహింసలకు గురి చేశారు. ఓఆర్ఆర్ మీదుగా సంగా రెడ్డికి తరలించారు. తాడుతో హేమంత్‌ మెడను బిగేసి హత్య చేశారు. రాత్రి 7:30కే హత్య చేసి సంగారెడ్డి మల్కాపూర్‌లో పడేశారు. నిన్న సాయంత్రం నుంచి పోలీసులు గాలింపు చేపట్టగా.. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కొల్లయ్యగూడెం వద్ద హేమంత్‌ శవమై కనిపించాడు.

హత్యకు కుట్ర……

హేమంత్ హత్య కు ఈనెల 20న లక్షారెడ్డి, యుగెంధర్ రెడ్డి కలిసి హత్యకు కుట్ర చేశారని, 10లక్షలకు ముగ్గురితో ఒప్పందం కుదర్చుకున్నట్లు తేలింది…లక్ష అడ్వాన్స్ ఇచ్చిన తరువాత ఎరుకల కృష్ణ, బిచ్చు యాదవ్, బాషా స్కెచ్ వేశారు. దీంతో ప్లాన్డ్ గా మూడు కార్లలో హేమంత్ నివాసానికి వెళ్ళి కిడ్నాప్ చేసినట్లు విచారణ లో తేలింది..ఇక హేమంత్ హత్య తరువాత తరువాత తన తండ్రి, మేనమామ యుగంధరే చంపించారు అని అవంతిక ఆరోపించారు. ఇక పోలుసులు దర్యాప్తు లోకూడా కిరాయి హంతకుల చేత హేమంత్ ను అవంతిక మేనమామ యుగంధర్ చంపించడాని తేలింది.. కిరాయి హంతకులను ఏర్పాటు చేసి పథకం ప్రకారమే హత్య చేశారని పోలుసుల విచారణ తేలింది.. యుగంధర్ తో పాటు 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేశారు. మద్యం సేవించి మత్తులో హత్య చేసినట్లు కొన్ని ఆధారాలు సేకరించారు.. తాడుతో మెడకు బిగేసి హత్య చేసినట్లు పోలీసులు విచారణ లో నిందితులు వెల్లడించారు.. రాత్రి 7:30కే హత్యచేసి సంగారెడ్డి మల్కాపూర్ లో చెట్ల పొదల్లో పడేశారని పోలీసులు తెలిపారు.. గోపన్ పల్లికి వెల్లాక కారులో నుండి దింపి మరోకారులో ఎక్కించారని, తాడుతో చేతులు, కాళ్లు కట్టి కారు వెనక సీట్లో చిత్రహింసలు గురి చేసినట్లు విచారణలో తేలింది.. హత్య చేసిన తరువాత పటాన్ చెర్వుకు చేరుకొని మరో ఇద్దరితో కలిసి మద్యం సేవించినట్లు విచారణ లో తేలింది… అక్కడినుండి సంతోష్ రెడ్డికి ఫోన్ చేసిన యుగేంధర్ రెడ్డి మాట్లాడాడు. అయితే అప్పటికే పోలీసుల అదుపులో సంతోష్ రెడ్డి ఉండడం తో ఫోన్ సిగ్నల్ ఆధారంగా యుగేంధర్ రెడ్డి ని అరెస్ట్ చేశారు.

దారుణంగా చంపేసి….

ఏన్నో ఆశలు పెట్టుకుని పెంచుకున్న కుమారుడ్ని దారుణంగా చంపేశారని హేమంత్‌ తల్లి రాణి బోరున విలపించారు. వేర్వేరు కులాలు అయినందు వల్లే తమ బిడ్డను పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. మా నాన్నకు ఇష్టం లేకుంటే నన్ను చంపాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది నేను. మా బావలు, వదినలు, మామయ్యలు, ఇద్దరు రౌడీలు నిన్న సాయంత్రం మూడు కార్లలో వచ్చి మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్లారని బోరున విలిపించింది…ఇక సినిమాలో హీరోగా మృతుడు హేమంత్‌ కుమార్‌ ఓ సినిమాలోనూ నటించాడు. అందమైన మాయ అనే సినిమాలో హీరోగా చేశాడు. 2015 డిసెంబర్‌ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఉస్మానియా ఆస్పత్రిలో మృత దేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు…మృతదేహం పాడవకుండా ఉండేందుకు గచ్చిబౌలిలోని కాన్‌టినెంటల్ హాస్పత్రికి తరలించారు. శనివారం చందా నగర్‌లో అంతక్రియలు జరుపుతామని తెలిపారు. ఈ నేపథ్యంలో యూకేలో ఉంటున్న హేమంత్‌ తమ్ముడు సుమంత్‌ అన్నయ్య కడసారి చూపుకోసం బయలుదేరాడు. ఇక 14మంది నిందితులను అరెస్ట్ చేసి , వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుల్లో ఒకరి కరోనా సోకినట్లు సమాచారం

Ravi Batchali
About Ravi Batchali 29941 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*