మల్లాది కి మళ్లీ ఛాన్స్ ఉంటుందా?

malladi-vishnu-ysrcongressparty

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపెవరది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరోసారి బరిలోకి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పోటీ చేస్తున్నారు. జనసేన బలపర్చిన సీపీఎం అభ్యర్థిగా సీహెచ్ బాబూరావు పోటీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నిజానికి ఒకప్పుడు కాంగ్రెస్ ను ఆదరించిది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన ఈ నియోజజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక్కడ మల్లాది విష్ణు అప్పట్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

గత ఎన్నికల్లో…..

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ, కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కమ్యునిస్టుల ప్రభావం కూడా కొంత మేరకు ఉంది. బోండా ఉమామహేశ్వరావు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పూనూరు గౌతం రెడ్డిపై దాదాపు 30 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో జనసేన మద్దతుతో పాటు బీజీపీ అలయన్స్ ఉండటంతో బోండాకు ఆ మెజారిటీ సాధ్యమయిందని చెప్పాలి. ఇక తాజా పరిణామాలను గమనిస్తే బోండా ఉమామహేశ్వరరావుకు గెలుపు అంత సులువు కాదనే చెప్పాలి.

వివాస్పదంగా మారి….

గత ఐదేళ్ల కాలంలో బోండా ఉమామహేశ్వరరావు వివాదాస్పదుడిగా మారారు. భూకబ్జాల వంటి అంశాల్లో బోండా కుటుంబం ఇరుక్కుంది. అంతేకాకుండా ఇటీవల బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒక వైద్యుడిని బోండా దుర్భాషలాడటం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు బోండాకు సహకరించే అవకాశం ఉన్నప్పటికీ ఆయన నోరు, వ్యవహారశైలి చేటు తెస్తుందంటున్నారు. జనసేన అభ్యర్థి బాబూరావు కూడా బలమైన అభ్యర్థిగా ఉండటంతో టీడీపీకి గత ఎన్నికల్లో పడే ఓట్లకు గండి పడే అవకాశముందంటున్నారు.

మల్లాదికి అన్ని వర్గాల నుంచి…..

ఇక మల్లాది విష్ణు విషయానికొస్తే ఆయనకు బ్రాహ్మణ సామాజిక వర్గం అండతో పాటు రెడ్డి, కాపు సామాజికవర్గంలో కొందరు మద్దతు పలుకుతున్నారు. పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం మల్లాది కి మద్దతు పలకడంతో కొంత ఊపు వచ్చింది. రంగా అనుచరుడిగా ముద్రఉన్న మల్లాది విష్ణుకు కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఓట్లు వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రసవత్తర పోరు జరుగుతుంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటితోనే అన్నది ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి తెలుస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 31024 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*