అతి విశ్వాసమా..? అహంకారమా….?

mayavathi-akhilesh-yadav-uttarpradesh

ఇద్దరికీ అతి విశ్వాసమే… తమకంటే గొప్పవారు లేరన్న ఇగో ఫీలింగ్. అందుకే అతిపెద్ద కాంగ్రెస్ పార్టీని కూడా పక్కన పెట్టారు. ఈ జోడీ రానున్న ఎన్నికల్లో హిట్ అవుతుందా? ఫట్టవుతుందా? చెప్పలేం కాని… వీరిద్దరి వ్యవహారం మాత్రం యూపీకి తామే కింగ్ ల మని చెప్పకనే చెప్పుకున్నట్లు అవుతుంది. దాదాపు 80 పార్లమెంటు స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో తమకు తప్ప మరొకరికి అధికారం రాకూడదన్న అహంకారం వారిద్దరిలో స్పష‌్టంగా కన్పిస్తోంది. వారే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లు.

ఇద్దరూ కలిస్తే….

ఇద్దరూ ఒకప్పటి బద్ధ శత్రువులైనప్పటికీ భారతీయ జనతా పార్టీని టార్గెట్ గా పెట్టుకుని కలిసి పోయారు. ఇద్దరం తగవులాడుకుంటే బీజేపీ తన్నుకు వెళ్లిపోతుందన్న విషయం అసెంబ్లీ ఫలితాల తర్వాత గాని వీరికి అర్థం కాలేదు. దీంతో ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడం, రెండు పార్టీలను ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించడంతో ఇక లోక్ సభపైనే దృష్టి పెట్టారు. మాయావతి పోటీకి దూరంగా ఉన్నా అఖిలేష్ యాదవ్ మాత్రం బరిలో ఉన్నారు.

సర్వేల ప్రభావంతో….

అయితే వివిధ సర్వే సంస్థలు అందించిన ఫలితాల ప్రకారం బీఎస్పీ, ఎస్సీ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని తేల్చి చెప్పడంతో వీరి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ముందుగా కాంగ్రెస్ ను పక్కనపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం అమేధీ, రాయబరేలి ఇస్తామని అవమానించారు. సీట్ల పంపకాన్ని ఏకపక్షంగా చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే యూపీలో బరిలోకి దిగుతుంది. దీనివల్ల కాంగ్రెస్ కు జరిగే నష్టం కన్నా బీజేపీకి జరిగే లాభమే ఎక్కువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినా మాయావతి మిగిలిన రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తో కలసి పోటీ చేయమని చెబుతోంది.

బీజేపీకి లాభమేనా?

తాజాగా గత ఉప ఎన్నికల్లో గెలిచిన పార్టీని కూడా బయటకు పంపించి వేసింది. గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యత్వానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో నిశాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిశాద్ కుమారుడు వ్రవీణ్ బరిలోకి దిగి గెలిచారు. అయితే ఈసారి తనకు మహారాజ్ గంజ్ స్థానం ఇవ్వాలని నిశాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిశాద్ భావించారు. కానీ ఎటూ తేల్చి చెప్పకవపోవడంతో బీజేపీకి ఈ పార్టీ దగ్గరయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. నిశాద్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది పక్కన పెడితే మాయావతి, అఖిలేష్ యాదవ్ లు తమకు తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారన్న వ్యాఖ్యలు మాత్రం విన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 37800 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*