పెద్దాయన పూనుకోవాల్సిందే….!!!

mulayamsingh-yadav-samajwadi-party

ఇక తప్పదు… ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీకి జరిగిన.. జరుగుతున్న నష్టాలను నివారించేందుకు పెద్దాయన పూనుకోవల్సిందే. లేకుంటే భవిష్యత్తులో పార్టీకి పుట్టగతులుండవు. ఇవి లక్షలాది మంది సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలది. ఉత్తరప్రదేశ్ లో అతి పెద్ద క్యాడర్ ఉన్న సమాజ్ వాదీ పార్టీ వరుస ఎన్నికల్లో ఇబ్బందులు పాలవుతోంది. ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో సైకిల్ ముందుకు సాగడం లేదు.

వరస ఓటములతో….

2014లో జరిగిన లోక్ సభ ఎన్నికలు,2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలు సైకిల్ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది. ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాతే పార్టీకి ఈరకమైన వరస దెబ్బలు తగులుతున్నాయి. గతంలోనూ ఎన్నడూ ఇలాంటి ఫలితాలు ములాయం నేతృత్వంలో చూడలేదు. అందుకే తిరిగి ములాయం సింగ్ పార్టీని చేతుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్ విన్పిస్తోంది.

కుటుంబ విభేదాలే….

పార్టీ భ్రష‌్టు పట్టి పోవడానికి ప్రధాన కారణం కుటుంబంలో రేకెత్తిన విభేదాలే అని చెప్పక తప్పదు. ములాయం సింగ్ వెంట ఆయన సోదరుడు శివపాల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వెంట మరోసోదరుడు రాంగోపాల్ యాదవ్ లు ఉన్నారు. ములాయంను, శివపాల్ యాదవ్ లను పార్టీ నుంచి బయటకు పంపడానికి ప్రధాన కారణం రాంగోపాల్ యాదవ్ అన్నది అందరూ అంగీకరించే విషయమే. శివపాల్ యాదవ్ ఉండగా తాను ఎదగలేనని భావించి, అఖిలేష్ కు, శివపాల్ కుమధ్య విభేదాలు రాంగోపాల్ యాదవ్ సృష్టించారన్న ప్రచారమూ జరిగింది.

ములాయం జోక్యంతోనైనా…..

ఈ నేపథ్యంలో త్వరలోనే ఉత్తరప్రదేశ్ లో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో కనీస స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంది. లేకుంటే పార్టీ కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో ములాయం సింగ్ యాదవ్ నేరుగా రంగంలోకి దిగారు. తమ్ముడు శివపాల్ యాదవ్, కుమారుడు అఖిలేష్ యాదవ్ ల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. శివపాల్ యాదవ్ ఇటీవల ప్రారంభించిన ప్రగతి శీల సమాజ్ వాదీ పార్టీని సమాజ్ వాదీ పార్టీలో విలీనం చేేసేందుకు ములాయం ప్రయత్నిస్తున్నారు. మరి పెద్దాయన పూనుకుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందన్న క్యాడర్ నమ్మకాన్ని కుటుంబం నిలబెడుతుందో? లేదో? చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 26910 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*