నాదెండ్ల ఫ్యూచర్ తేలిపోనుందా…!

గుంటూరు జిల్లాలో ఆంధ్రా ప్యారిస్‌గా పేరున్న తెనాలి నియోజకవర్గం ఎంతో మంది రాజకీయ ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. ఆలపాటి వెంకటరామయ్య, దొడ్డపనేని ఇందిర, అన్నాబత్తుని సత్యనారాయణ, నాదెండ్ల మనోహర్‌, ఆలపాటి రాజా లాంటి కీలక నేతలు ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కాకలతీరిన‌ రాజకీయ యోధుడు అయిన ఆలపాటి వెంకటరామయ్య, ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిర చెరో మూడు సార్లు మొత్తం ఆరు సార్లు విజయం సాధించగా దొడ్డపనేని ఇందిర కుమార్తె గోగినేని ఉమ సైతం 1999లో గెలిచారు. ఇక దొడ్డపనేని ఇందిరను మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ వరుసగా రెండు సార్లు ఓడించారు. రాష్ట్ర రాజకీయాల్లో తెనాలి నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్‌ ఉంది. ఇక్కడ నుంచి గెలిచిన పార్టీయే స్టేట్‌లో అధికారంలోకి వచ్చింది.

గత ఫలితాలను చూస్తే…..

1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఈ సెంటిమెంట్‌ జరగగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సైతం ఇదే సెంటిమెంట్‌ రిపీట్‌ అయ్యింది.1983, 85లో టీడీపీ నుంచి మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ, 1989లో మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావు, 1994లో డాక్టర్‌ రావి రవింద్ర‌నాథ్‌, 1999లో డాక్టర్‌ గోగినేని ఉమ, 2004, 2009లో మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, 2014లో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విజయాలు సాధించారు. ఇక్కడ వీరు గెలిచినప్పుడే… స్టేట్‌లో స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నారో అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. తెనాలి నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులకే ప్రధాన పార్టీలు సీట్లు ఇవ్వడంతో ఆ వర్గం వారే ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతూ వస్తున్నారు. నియోజకవర్గాల పున‌ర్విభజనలో తెనాలి నియోజకవర్గం రూపురేఖలు మార్చుకుంది. తెనాలి మున్సిపాలిటీతో పాటు, తెనాలి మండలం, గతంలో దుగ్గిరాల నియోజకవర్గంలో ఉన్న కొల్లిప‌ర మండలం కలవడంతో ఆ మండలంలో రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే తెనాలి రూరల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు సైతం బలంగా ఉన్నారు.

మూడో స్థానంలో ప్రజారాజ్యం…..

2009లో జరిగిన ట్రైయాంగిల్‌ ఫైట్‌లో ప్రజారాజ్యం నుంచి కాపు సామాజికవర్గానికే చెందిన ప్రస్తుత గుంటూరు వైసీపీ లోక్‌సభ నియోజకవర్గ సయన్వయకర్త కిలారు రోశ‌య్యకు సీటు ఇవ్వగా ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గత నాలుగున్నర ఏళ్లలో తెనాలిలో ఆహా ఓహో అనుకునేంత గొప్పగా అయితే అభివృద్ధి చెయ్యలేదన్నది సగటు తెనాలి ఓటరు చెబుతున్న మాట. తెనాలిలో 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక‌ మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ, 2004, 2009 గెలిచి డిఫ్యూటీ స్పీకర్‌, స్పీకర్‌ అయిన నాదెండ్ల మనోహర్‌ టైమ్‌లో జరిగిన అభివృద్ధే తప్పా ఇప్పుడు కొత్తగా రాజా వల్ల ఒరిగింది శూన్యమే అంటున్నారు. తెనాలిలో అన్నాబత్తుని సత్యనారాయణ, నాదెండ్ల మనోహర్‌ చేసిన అభివృద్ధి పనులు తెనాలి చరిత్రలోనే ప్రత్యేకంగా మిగిలిపోయాయి.

కొన్ని వర్గాల్లో అసంతృప్తి……

నియోజకవర్గంలో కొన్ని సామాజికవర్గాల వారు సైతం రాజా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక తెనాలి నియోజకవర్గంలో గత నాలుగు ఏళ్లలో జరిగిన భూ అక్రమణలు, దందాలు గురించి కూడా జనాలు తీవ్రంగా చ‌ర్చించుకుంటున్నారు. అధికార పార్టీలోనే పదవుల మార్పుతో సొంత కేడర్‌లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతుంది. విచిత్రం ఏంటంటే తెనాలి నియోజకవర్గంలో మనోహర్‌ పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులే ఇంకా పూర్తి చెయ్యలేని స్థితి. అలాగే మున్సిపాలిటీలోను గత పాలక పక్షం విడుదల చేసిన నిధులే ఇంకా ఖ‌ర్చు చెయ్యలేద‌ని తెలుస్తోంది. దీనిని బట్టి తెనాలి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

నాలుగేళ్లుగా కష్టపడుతూ…..

అయితే పార్టీలో యూత్‌ను, కేడ‌ర్‌పై పూర్తి గ్రిప్ ఉన్న‌ నేపథ్యంలో రాజా మిగిలినవి ఎలా ఉన్నా పార్టీలో బలమైన అభ్యర్థే. విపక్ష వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ కుమారుడు అన్నాబత్తుని శివకుమార్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. నాలుగేళ్లగా పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ కార్యక్రమాలను బలంగా జనాల్లోకి తీసుకువెళ్తున్నా వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఆయనకే సీటు ఇస్తారా లేదా ? అన‌్న‌ది కొంత సందేహంగా ఉంది. జగన్‌ గుంటూరు జిల్లాల్లో బలమైన అభ్యర్థులను కూడా మార్చేసి తన లెక్కల్లో తాను ఉన్నారు. ఈ క్రమంలో తెనాలి అభ్యర్థి విషయంలో ఏం చేస్తారో క్లారిటీ లేదు. అయితే తెనాలిలో ప్రస్తుతం శివకుమార్‌కు మించిన అభ్యర్థి పార్టీలో లేకపోవడం కలిసి రానుంది. జనసేన విషయానికి వస్తే నియోజకవర్గంలో పవన్‌ అభిమానులు, కాపు సామాజికవర్గం బలంగా ఉంది. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం సామాజిక ఈక్వేషన్ల బ్యాలెన్స్‌ మిస్‌ చెయ్యడంతో సక్సెస్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జనసేనలో చేరడంతో ఆయనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి.

గట్టి పోటీ ఇస్తారా….?

మనోహర్ పేరు జనసేన నుంచి గుంటూరు ఎంపీ రేసులో వినపడుతున్నా ఆయన తెనాలి అసెంబ్లీకి పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మనోహర్‌ జనసేన నుంచి తెనాలి అసెంబ్లీ బరిలో ఉంటే నియోజకవర్గంలో ఆయనకు న్యూట్రల్‌గా ఉన్న ఓటు బ్యాంక్‌తో పాటు జనసేన, పవన్‌ అభిమానులతో ఆయన గట్టి పోటీ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. గత ఎన్నికల్లో స్టేట్‌లో కాంగ్రెస్ నిర్వీర్యం అయినా ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మనోహర్‌ దాదాపు కాస్త అటూ ఇటుగా 1700 0ఓట్లు సాధించారు. దీనిని బ‌ట్టి మనోహర్‌కు నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిగత ఇమేజ్‌ తెలుస్తోంది. ఇప్పుడు ఆ వ్యక్తిగత ఇమేజ్‌కి తోడు పవన్‌ అభిమానులు, కాపు సామాజికవర్గ ఓటర్లు తోడైతే ఆయన అక్కడ బలమైన అభ్యర్థి అవ్వడంతో పాటు ప్రాధాన పార్టీలకు షాక్‌ ఇచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. మరి ఫైన‌ల్‌గా తెనాలి నియోజకవర్గంలో జరిగే హోరాహోరి సమరంలో ఎవరు విజయం సాధిస్తారో చూడాల్సి ఉంది.

Subhash Vuyyuru
About Subhash Vuyyuru 2659 Articles
Subhash Vuyyuru entered into journalism at the young age of 21 as a staff reporter in one of the leading news daily in Andhrapradesh. He has been working in various capacities such as state bureau reporter and sub editor since then. Subhash always says that he will show the same level of interest and passion towards his profession till the end of his career. He also says that his love towards journalism is no less than his love towards his parents and family. He has crystal clear understanding towards contemporary state and national level politics which is very evident through his fearless and sensational articles. He thinks that journalism clubbed with honesty and integrity can really influence the society and helps to bring positive changes in the society.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*