
రాజకీయాల్లో చిత్రమైన వ్యవహారాలు తెరమీదికి వస్తుంటాయి. అదుగో పులి.. అనే లోగానే.. ఇదిగో తోక..!! అనేయాలనేది నాయకులు చెప్పే అసలు సిసలు రాజకీయ సూత్రం! అచ్చు ఇలాంటి సూత్రాన్నే ఏపీ సీఎం చంద్రబాబు ఫాలో అవుతు న్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన తాజాగా ఢిల్లీలో చేసిన కొన్ని ప్రకటనలు వాటి సారాంశాలను తెలుసుకుంటే.. ఇదే సూత్రాన్ని ఆయన ఫాలో అవుతున్నట్టుగా మనం గుర్తించవచ్చు అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. ఢిల్లీ పీఠంపై చంద్రబాబు మండిపడుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేసిందని అంటున్నారు. అదే సమయంలో మోడీ ప్రభుత్వం విపక్షాలపై విరుచుకుపడుతోందని సెలవిస్తున్నారు.
తనపైనా దాడులంటూ…..
అంతా బాగానే ఉంది. వాస్తవానికి చంద్రబాబు చెబుతున్న ప్రతి విషయమూ..కూడా కొత్త కాకపోయినా.. అందరూ తలలు పంకిస్తున్నారు. అయితే, ఈ సందర్భంలోనే చంద్రబాబు తనపైనా దాడులు చేస్తారు! అంటూ.. సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు దీనిపైనేచర్చ సాగుతోంది. ఆయన చేసింది ఆత్మ రక్షణకోసమా? సానుభూతి కోసమా? లేక మరేదైనా ఉందా? అనే కోణంలోనే చర్చలు నడుస్తున్నాయి. ‘ఒక సీనియర్ నాయకుడిగా దేశంలో ఏం జరుగుతోందో చెప్పడం నా బాధ్యత. అందుకే ఢిల్లీకి వచ్చాను. ఫిర్యాదులు చేసేందుకు కాదు… పరిష్కారం వెతికేందుకే వచ్చాను. ఇది ప్రారంభం మాత్రమే! మున్ముందు అనేక వేదికలపై గొంతెత్తుతాను’’ అని ప్రకటించడం ద్వారా చంద్రబాబు ఏం చేయాలనుకుం టున్నారో స్పష్టం అవుతూనే ఉంది.
స్వీయ రక్షణ కోసమేనా…?
అయితే, ఈ క్రమంలోనే ఆయన చేసిన స్వీయ రక్షణ వ్యాఖ్యలు మాత్రం ఒకింత విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. అనూహ్యమైన వ్యాఖ్యలు చేశారు. తనపైనా ఐటీ అధికారు లు దాడులు చేసే ప్రమాదం ఉందన్నారు. అయితే,వీటిని ప్రజలు లైట్‌గానే తీసుకున్నారు. నిజమే చంద్రబాబుపై దాడులు జరగకూడదనేందుకు అవకాశం ఏముంటుంది. దేశంలోనే అత్యంత ఆదాయం, సంపన్నుడు అయిన ముఖ్య మంత్రి ఎవరైనా ఉన్నారంటే.. ఆయన చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా హెరిటేజ్ వ్యవస్తాపక చైర్మన్ పదవిలో ఉన్నారు.
ఆస్తుల మాటేమిటి…?
ఇప్పుడు దీని షేర్ దాదాపు రూ. 4000 పైమాటే. వ్యాపారం కేవలం రెండు న్నరేళ్లలో వేల కోట్లకు పుంజుకుంది. కుటుంబానికి కూడా భారీగానే ఆస్తులు ఉన్నాయి. ఇంకా కన్నయినా తెరవని, చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కు పదుల కోట్ల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు సమర్పిస్తున్న అఫిడవిట్లలోనే ఉన్నాయి. మరి ఆయన (దేవాన్ష్) కు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటే సమాధానం ఏం చెబుతారు? ఇలా అనేక విషయాలు ఉన్నాయి. దాడులు చేస్తే.. వాటికి సమాధానం చెప్పి బయటకు రావాలే తప్ప.. దీనిని రాజకీయంగా మలుచుకుంటానంటే.. చంద్రబాబుకే చెల్లింది! అంటున్నారు పరిశీలకులు.
Leave a Reply