
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు ఈరోజు పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని తెలియజేశారు. ఆయన ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈరోజు కూడా పార్లమెంటు బయట, లోపల నిరసనలను తెలియజేయాలని కోరారు. ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడాలన్నారు. ప్రజలు హర్షించేలా, వారి మన్ననలను పొందేలా ఆందోళనలు ఉండాలని దిశా నిర్దేశం చేశారు. చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు.
వైసీపీని ఎవరూ నమ్మరు……
ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. కేంద్రం సహకరించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎంతో నష్టపోయిందని ఆవేదన చెందారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ బంద్ లకు పిలుపునిచ్చి మరో నష్టాన్ని కలగచేస్తుందని అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేసి ఏపీ రోడ్లమీద తిరిగితే ప్రజలు నమ్మరని చెప్పారు. కేంద్రాన్ని ఢిల్లీలో నిలదీయాలని, ఆంధ్రప్రదేశ్ లో కాదని చెప్పారు. కాగా నేడు ఏపీ విభజన హామీలపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
Leave a Reply