
జనం ఏమనుకుంటున్నారు.. ఏం అడుగుతున్నారు.. నేతలు ఏం ఇస్తున్నారు ఏం బావుకుంటున్నారు.. ఏం చేయాలనుకుంటున్నారు..ప్రశ్నల పరంపరని మనం ఆపగలమా,.. ప్రశ్నించే మీడియా ప్రశ్నించాల్సిన జనం మధ్య నలిగిన కొన్ని విషయాలు ఈ రోజు డిజిటల్ తెరపైకి వస్తున్నాయి. ఈ రోజు తిరుపతి వెంకన్న సాక్షిగా మరో సమరానికి సన్నద్ధమయ్యారు బాబు. లక్షన్నర జనవాహిని తోడుగా శేష వాహిని చెంత ఈ విశేషానికి శ్రీకారం చుట్టారన్నది తెలుగు తమ్ముళ్ల మాట.సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇచ్చిన మాట మోడీ తప్పారు. ఇంకా తప్పుతూనే ఉన్నారు అన్నది వారి వేదన. అవును ఈ కాలంలోనే చాలా జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొన్నింట ఎన్డీఏ సర్కారు యూపీఏ కన్నా హాశ్చర్యకర రీతిన ఘోర వైఫల్యాలను ఎదుర్కొంది. ఇక్కడ నిధులు ఏమిచ్చారో చెబితే కమల నాథులు క్లారిటీ ఇచ్చినట్లు.. పోనీ ఇవ్వనివి ఇచ్చినవి లెక్క రెండు ప్రభుత్వాలూ తేల్చేయాలిక.
కొద్దిగా ఆలోచించండి …
కాంగ్రెస్ వస్తే హోదా
బీజేపీ మరో సారి వస్తే హోదాకు సమానంగా ఏదో
వైసీపీ పగ్గాలు అందుకుంటే హోదా తప్ప మరేమీ అడగక పోరాటం
ఇవన్నీ హాస్యాస్పదం గా ఉన్నాయి,. చూడండి మనం ఎంతగా వెనకబడిపోయినా ఎవ్వరూ అడగరు. కర్ణాటక ఎన్నికల పుణ్యమాని నాలుగు అయిదు రోజులుగా పాపం బీజేపీ ప్రభుత్వం పెట్రోలు డీజిలు ధరలు పెంచదు. ప్రస్తుతం హస్తినపురి లెక్క ప్రకారం లెక్కలు మారవు. అదే ధరవరలు తప్పవు.ఇక బాబు గారి సర్కార్ పోరాటం ఏ విధమ్మున ఉండనుందో చూద్దాం. కర్ణాటక ఫలితాలు తరువాత బీజేపీ వైఖరిలో ఏ మార్పు రానుందో కూడా ఆలోచిద్దాం. ఓడిపోతే బీజేపీ దిగివస్తుందని అనుకోలేం కనీసం ఆత్మ శీలన చేసుకుంటే మేలు. ఇక బాబు – బీజేపీ బంధం పూర్తిగా తెగిన గాలిపటంలా మారిపోవడం ఖాయం. ఇప్పుడు చెప్పండి పది రోజుల వ్యవధిలో రెండు దీక్షలు వీటి ఫలాలు ఫలితాలు నేతలు అందుకుంటా రా.. అన్నదే కొసరు ప్రశ్న.
ఇప్పటికే సైకిల్ యాత్రలు…
అలానే గ్రామగ్రామాన తిరిగి కేంద్రం చేసిన అన్యాయం ఏంటన్నది చెప్పేందుకు ప్ర్తయత్నించారు వీటిని ప్రజలు అంగీకరిస్తారా,..లేకా పసుపు దండు నేతలు చేసిన లేదా చెప్పిన యాత్రలు మాటలు వృథానేనా! మోడీవి అబద్ధాలేనని రాహుల్ అంటున్నాడు కుట్ర మోసపూరిత రాజకీయాలు ఆయనవి అని టీడీపీ అంటోంది. ఈ దశలో ఏపీ ఏం సాధిస్తుం దని?? ఇంతకాలం కేంద్రం రాష్ట్రం భాయీ భాయీ అని చెట్టపట్టాలేసుకుని తిరిగి ఇప్పుడిలా యూ టర్న్ తీసుకుంటే జనం ఏమనుకోవాలి.. ఓ కీలక కేసు విషయమై రాజీ పడిపోయారా ?? పదో షెడ్యూల్ కిందనో మరొకటో ఇంకొకటో కింద ఆస్తుల పంపకం ఇప్పటికీ తేలదా .. ఇంకా ఇంకొన్నింటికి ఆన్సర్ ఇయ్యాలే. ఇస్తారా బీజేపీ కరపత్రాలు సిద్ధం చేసిందని అప్పుడప్పుడూ అంటుంటారు నేతలు అవి ఏమైనట్లు.. ఎటు పోయినట్లు.. ?నిధులు లేకుండా గ్రోత్ రేట్ ఎలా వచ్చిందని సఖ్యత లేకుండానే అవార్డులు ఎలా అందుకుంటున్నారని.. ఏ కారణం లేకుండానే మహారాష్ట్ర మంత్రి జీవన సహచరికి టీటీడీ పాలకమండలి సభ్యత్వం ఇచ్చారని,.. అంటే లోపల ఒప్పందాలు వేరు బయట వెల్లడి అయ్యే నిజం లాంటి అబద్ధం వేరువేరు అనా.. ఏమో! బాబుకు పోటీగా వైసీపీ కూడా వైజాగ్ లో దీక్ష చేశారాయె.. ఇలా పోటాపోటీగా వంచన పేరిట ద్రోహం పేరిట దీక్షలెందుకు చేస్తున్నారంటే ఆ కారణం బహిరంగ రహస్యం.
Leave a Reply