టీడీపీలో ఆ లేడీ ఎమ్మెల్యేల‌కు టికెట్లు క‌ష్ట‌మే…!

రాష్ట్రంలో 2019 ఎన్నిక‌ల వేడి రాజుకుంది. దీంతో అన్ని పార్టీల్లోనూ పెద్ద ఎత్తున టికెట్ల విష‌యంలో పార్టీల అధినేత త‌ర్జ న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఇవ్వాల‌ని అదికార టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తు న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌తి సీటు విష‌యంలోనూ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో గ‌త ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలుపొందిన మ‌హిళా ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఎలా ఉంది? వారు ప్ర‌జ‌ల్లో ఎలా దూసుకుపోతున్నారు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి మ‌ళ్లీ టికెట్ ఇస్తే.. ప‌రిస్థితి ఎలా ఉంటుంది? గ‌ట్టి పోటీ ఇస్తారా? లేదా? అనే ప్ర‌ధాన అంశాలు స‌హా ప్ర‌భుత్వం, పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలను వారు ఎలా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్తున్నార‌నే విష‌యంపైనా చంద్ర‌బాబు స‌ర్వే చేయించార‌ని స‌మాచారం.

తిరుపతి ఎమ్మెల్యేకు…..

ఈ స‌ర్వే తాలూకు వివ‌రాల‌ను తెలుసుకున్న ఆయ‌న రాష్ట్రంలోని ఐదుగురు మ‌హిళా ఎమ్మెల్యేల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఆయా ఎమ్మెల్యేల విష‌యం తాజా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇం తకీ ఆ మ‌హిళా ఎమ్మెల్యేలు ఎవ‌ర‌నే విష‌యాన్ని చూస్తే.. చిత్తూరు జిల్లా తిరుప‌తి ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌. గ‌త ఎన్నిక‌ల్లో ఈమె భ‌ర్త వెంక‌ట‌ర‌మ‌ణ పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే, అనారోగ్య కార‌ణంగా ఆయ‌న మృతి చెంద‌డంతో ఆ స్థానానికి జ‌రిగిన ఉప పోరులో సుగుణ‌మ్మ గెలుపొందారు. అయితే, ఆమె ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌క‌పోవ డం తీవ్ర వివాదంగా మారింది. పైగా ఆమెకు టీటీడీలో ఎదురైన ప‌రాభ‌వం, చంద్ర‌బాబు బుజ్జ‌గింపు వంటివి తెలిసిందే.

యామినీ బాలది కూడా అదే……

అవ‌స‌ర‌మైన విష‌యాల‌ను ఫోక‌స్ చేయ‌డం మానేసిన సుగుణ‌మ్మ‌.. అన‌వ‌ర‌స‌ర‌మైన విష‌యాల‌ను పెద్ద‌వి చేసి చూపి స్తున్నార‌ని అంటున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో ఆమె పేరుపెద్ద‌గా వినిపించడం లేద‌ని చంద్ర‌బాబుకు ఫిర్యాదులు అందా యి. దీంతో ఆమెకు టికెట్ ఇచ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఇక‌, శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే యామినీబాల ప‌రిస్థితి మ‌రిం త దారుణంగా ఉంది. వృత్తి రీత్యా టీచ‌ర్ అయిన యామినీ బాల‌..త‌న త‌ల్లి శ‌మంత‌క‌మ‌ణి ప్రోత్సాహంతో రాజ‌కీయాలు చేప‌ట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు కంచుకోట‌గా మారిన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం శింగ‌న‌మ‌ల నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే, ఆమె ప్ర‌జ‌ల‌లోకి వెళ్ల‌డం లేద‌ని చంద్ర‌బాబుకు స‌ర్వేలో స్ప‌ష్టంగా తెలిసింది. వాస్త‌వానికి ఆమె మంత్రి ప‌ద‌విని ఆశించారు. అయితే, ఆమె విప్ ప‌ద‌విని అప్ప‌గించిన బాబు.. మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌లేదు.

పిల్లికి కూడా కష్టమే……

దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనై.. పార్టీ, ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డం లేదు. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమెకు కూడా టికెట్ ల‌భించే ఛాన్స్ లేద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ పార్టీ త‌ల్లి శ‌మంత‌క‌మ‌ణి, కూతురు యామినీబాల వ‌ర్గాలుగా చీలిపోయింది. ఇక‌, తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే పిల్లి అనంత‌ల‌క్ష్మి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. పేరుకే ఆమె ఎమ్మెల్యే కానీ, ఆమె ఇంటి గ‌డ‌ప మాత్రం దాటదు. మొత్తం వ్య‌వ‌హారం అంతా.. ఆమె భ‌ర్తే చూసు కుంటున్నారు. దీంతో ఇక్క‌డ పార్టీ ప‌రువు గంగ‌లో క‌లుస్తోంది. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ హామీ కూడా ఇక్క‌డ నెర‌వేర‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా ఎమ్మెల్యే భ‌ర్త ప్ర‌తి ప‌నికీ “ఇంత‌“- అని రేటు క‌ట్టి.. వ‌సూలు చేస్తుండ‌డం కూడా పార్టీని ఇర‌కాటంలోకి నెడుతోంది.

వైసీపీ నుంచి వచ్చిన……

దీంతో ఆయా విష‌యాల‌ను తెలుసుకున్న చంద్ర‌బాబు.. పిల్లి అనంత లక్ష్మికి టికెట్ ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యించుకున్నా ర‌ని స‌మాచారం. ఇక‌, కృష్ణా జిల్లా పామ‌ర్రు ఎమ్మెల్యే ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఉప్పులేటి క‌ల్ప‌న విష‌యం మ‌రింత దారుణంగా ఉంది. ఈమె 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించింది. అది కూడా వ‌ర్ల రామ‌య్య‌ను చిత్తుగా ఓడించింది. అయితే, రెండేళ్ల కింద‌ట చంద్ర‌బాబు ఆక‌ర్ష్ ప్ర‌భావంతో ఆమె సైకిల్ ఎక్కారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్‌తో పాటు.. ప్యాకేజీ కూడా బాగానే ముట్టంద‌నే వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో జోరుగా వినిపించాయి. అయితే, ఆమెకు మొద‌ట్లో ఉన్న టీడీపీ ఫాలోయింగ్ ఇప్పుడు త‌గ్గుతూ వ‌చ్చింది.

ఎవరినీ కలుపుకుని పోకుండా…..

నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రినీ క‌లుపుకొని పోవ‌డం లేద‌ని, ప్ర‌జలు, వ్యాపారుల నుంచి వ‌సూళ్లు పెరుగుతున్నాయ‌ని ఫిర్యా దులు అందుతున్నాయి. వీటికితోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి మ‌ళ్లీ పోటీ చేయాల‌ని భావిస్తున్న వ‌ర్ల రామ‌య్య‌. ఈమెను త‌ప్పించేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతోనూ ఉప్పులేటి క‌ల్ప‌నకు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి క‌ని పించ‌డం లేద‌ని అంటున్నారు. ఇక‌, మ‌రో ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి మృణాళిని ప‌రిస్తితి కూడా దారుణంగానే ఉంది. ఈమెకు కూడా టికెట్ వ‌చ్చే ప‌రిస్తితి క‌నిపించ‌డం లేదు. దీనికి ఆమె చేజేతులా చేసుకున్న ప‌రిస్థితులేన‌ని అంటున్నారు. ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గం కాక‌పోయినా.. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆమెకు చీపురు ప‌ల్లిని కేటాయించారు.

వైసీపీపై పోటీకి సరితూగరని….

ఇక్క‌డ నుంచి గెలుపొందిన ఆమెను మంత్రిగా కూడా చంద్ర‌బాబు కీల‌క ప‌దవిని అప్ప‌గించారు. అయితే, వృత్తి రీత్యా డాక్ట‌ర్ కావ‌డంతో ఆమె త‌న వైద్య‌శాల‌లు డెవ‌ల‌ప్ చేసుకోవ‌డంతోనే స‌రిపుచ్చుకున్నార‌ని ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం అందు బాటులో కూడా లేకుండా పోయార‌ని ఫిర్యాదులు అందాయి. దీంతో గ‌త ఏడాది ఏప్రిల్‌లో నిర్వ‌హించిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆమెను తొల‌గించారు. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ టికెట్ కూడా ల‌భించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెను త‌ప్పించ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి మొత్తానికి రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేల్లో ఈ మ‌హిళా ఎమ్మెల్యేల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ టికెట్లు వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని టీడీపీ సీనియ‌ర్‌లే వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Ravi Batchali
About Ravi Batchali 30968 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*